News May 4, 2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: TDPపై వైసీపీ ఫిర్యాదు

image

ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంచలనంగా మారింది. ఈ చట్టంపై IVRS కాల్స్ ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ.. విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాలని సీఐడీని ఆదేశించారు.

Similar News

News November 6, 2024

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు.. కారణమిదే!

image

AP: ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, YCP హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది.

News November 6, 2024

ట్రంప్ జోరు: మళ్లీ కిచెన్ సింక్ ఫొటో షేర్ చేసిన మస్క్

image

US ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ హవాను బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎంజాయ్ చేస్తున్నారు. వైట్‌హౌస్‌లో కిచెన్ సింక్‌తో అడుగుపెట్టినట్టు ఓ ఎడిటెడ్ ఫొటోను పోస్ట్ చేశారు. ‘LET THAT SINK IN’ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఆయన ఇలాగే సింక్‌తో ఆఫీస్‌లోకి ఎంటరవ్వడం తెలిసిందే. ఆ తర్వాత తన విజన్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టారు. వైట్‌హౌస్‌లో భారీ సంస్కరణలు ఖాయమని సింబాలిక్‌గా ఇలా చెప్పారు.

News November 6, 2024

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు

image

ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.