India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

T20WC కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. 15 మంది సభ్యుల్లో ముగ్గురు పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లను సెలక్ట్ చేసింది. ఇందులో బుమ్రా తప్ప మిగతా ఇద్దరు అంతంతమాత్రమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారీగా పరుగులు సమర్పించుకుంటారని.. వారికి బదులు మయాంక్ యాదవ్/నటరాజన్/సందీప్ శర్మలను తీసుకుంటే బాగుండేదంటున్నారు. మరి భారత బౌలింగ్ లైనప్‌పై మీ కామెంట్ ఏంటి?

హీరోయిన్ మాళవిక మోహనన్ ఓ నెటిజన్ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారు. ఈరోజు ఉదయం ఆమె ట్విటర్‌లో ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘గ్లామర్ షో ఆపి నటించడం ఎప్పుడు మొదలుపెడతావు?’ అని ప్రశ్నించారు. ‘ఎప్పటికీ నటించను. నీకేమైనా సమస్యా?’ అంటూ అతడికి జవాబిచ్చారు మాళవిక. ఇక సమంత, అనుష్క తనకు ఇష్టమైన హీరోయిన్లని, హృతిక్ రోషన్ తొలి క్రష్ అని ఇతర ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

*స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయలేదు
*గిల్, రింకూ సింగ్ మెయిన్ స్క్వాడ్‌లో లేరు. రిజర్వ్ ప్లేయర్లలో చోటు
*చాహల్, సంజూ, శివమ్ దూబేకి అవకాశం
*టీమ్ ఇండియాలోకి రిషభ్ పంత్ రీఎంట్రీ
*IPL-2024 సంచలనాలు అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్, తిలక్ వర్మ, గైక్వాడ్, రియాన్ పరాగ్‌కు చోటు దక్కలేదు.

AP: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. వైసీపీ యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, టీడీపీ నుంచి సీనియర్ మైనార్టీ నేత ఎన్‌ఎండీ ఫరూక్ ప్రజాక్షేత్రంలో ఢీకొంటున్నారు. గతంలో ఇక్కడ మూడు సార్లు గెలిచిన ఫరూక్ మంత్రిగాను చేశారు. ఇద్దరు నేతలు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, పథకాలను ప్రస్తావిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముస్లిం ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

AP: ఏప్రిల్ నుంచే రూ.4,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘దివ్యాంగులకు రూ.6,000, 100 శాతం వైకల్యం ఉన్నవారికి రూ.15,000, కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్థులకు రూ.10,000 పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. పేదలకు పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎవరికీ రద్దు చేయం’ అని తెలిపారు.

AP: రాష్ట్రంలో కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మేనిఫెస్టో టీడీపీ-జనసేనదే అని చంద్రబాబు చెప్పారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ స్థాయిలోనే మేనిఫెస్టో ఇచ్చిందని, రాష్ట్రస్థాయిలో మేనిఫెస్టో ఉండదని చెప్పారు. దీనికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. టీడీపీ-జనసేన కలిసి మేనిఫెస్టోపై కసరత్తు చేశాయని, బీజేపీ సలహాలు తీసుకున్నామని తెలిపారు.

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ సీక్వెన్స్‌ను తొలిసారి జర్నల్‌లో ప్రచురించిన సైంటిస్ట్ జాంగ్ యోంగ్‌జెన్‌ను చైనా ప్రభుత్వం వేధిస్తోంది. ఇప్పటికే డిమోషన్లతోపాటు పలు కార్యక్రమాలకు ఆయనను బహిష్కరించింది. తాజాగా జాంగ్ పనిచేస్తోన్న ల్యాబ్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో ఆయన అక్కడే నిరసనకు దిగారు. తన బృందాన్ని కూడా ల్యాబ్ నుంచి బయటకు పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

✒ బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం; బీసీ సబ్‌ప్లాన్ కింద రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు
✒ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్
✒ సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేల సాయం
✒ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
✒ పాడి పరిశ్రమకు ప్రత్యేక రుణాలు
✒ దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల జీతం.. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్

వరుస అప్‌డేట్స్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. ఇటీవల అశ్వత్థామ పరిచయ వీడియో, మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించగా తాజాగా మరో సర్‌ప్రైజ్ ఉందంటూ ప్రకటించారు. ‘డార్లింగ్స్. మీకు ఒక చిన్న సర్‌ప్రైజ్. వేచి ఉండండి’ అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

AP: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఆయా పార్టీల అధినేతలు రిలీజ్ చేశారు. వాటిలో ముఖ్యమైనవి..
✒ ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15,000
✒ దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీ
✒ రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం
✒ నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి
✒ ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ✒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం
Sorry, no posts matched your criteria.