India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప.బెంగాల్‌లో వర్ష(35) అనే మహిళ ఊపిరితిత్తుల నుంచి డాక్టర్లు ముక్కుపుడక పిన్నును బయటికి తీశారు. ఆమె 17ఏళ్ల నుంచి ఆ ముక్కు పుడక పెట్టుకొని ఉన్నారు. ఈ క్రమంలో పొరపాటున అది ముక్కు ద్వారా లోపలికి వెళ్లిపోయింది. నెల రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పిన్ను ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి బయటికి తీశారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

తేది: ఏప్రిల్ 28, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:36
సూర్యోదయం: ఉదయం గం.5:52
జొహర్: మధ్యాహ్నం గం.12:14
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:36
ఇష: రాత్రి గం.07.52
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఐపీఎల్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఘనత సాధించారు. ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఓపెనర్‌గా రాహుల్ నిలిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (4041) రికార్డును అధిగమించారు. 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. అగ్రస్థానంలో శిఖర్ ధవన్ (6362) ఉన్నారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

* కాంగ్రెస్ దక్షిణభారత్‌ను ప్రత్యేక దేశం చేయమంటుంది: PM మోదీ
* మేనిఫెస్టో విడుదల చేసిన CM జగన్
* కేసీఆర్ ‘కరెంట్ కట్’ మాటలు అబద్ధం: CM రేవంత్
* ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి కేసీఆర్ ఎంట్రీ
* తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
* ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
* ప్రభాస్ ‘కల్కి’ జూన్ 27న విడుదల
* నేను దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతోంది?: KCR

ముంబై ఎయిర్‌పోర్టు టెర్మినల్-1లో బాంబు ఉందంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్, విమానాశ్రయ అధికారులను పరుగులు పెట్టించింది. టెర్మినల్ అంతా జల్లెడ పట్టి బాంబు లేదని నిర్ధారించుకున్న అనంతరం వారు ఊపిరి పీల్చుకున్నారు. అది ఆకతాయిల బెదిరింపు కాల్ కావొచ్చని తెలిపారు. ఓ ఉద్యోగినికి ఆ కాల్ వచ్చిందని వెల్లడించారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీల అనంతరం కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.

నాణ్యమైన బౌలర్లు లేనంతవరకూ RCB టైటిల్ సాధించలేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘స్టార్ బ్యాటర్లతో ఎల్లప్పుడూ మ్యాచ్ గెలవలేం. మంచి బౌలర్లు కూడా జట్టులో ఉండాలి. కానీ అలాంటి బౌలింగ్ దళం ఆర్సీబీకి లేదు. వచ్చే వేలంలోనైనా నాణ్యమైన బౌలర్లను తీసుకోవాలి. అప్పుడే జట్టులో సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే ఆర్సీబీ సపోర్టింగ్ సిబ్బందిలో భారతీయుడు ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.

ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు BCCI జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనకు ఫైన్ విధించింది. కాగా ఈ సీజన్‌లో ఇషాన్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 212 రన్స్ చేశారు. అతడి బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు.

మరణించిన ఓ అభ్యర్థికి ఓటేసి గెలిపించిన విషయం తెలుసా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆళ్లగడ్డ YCP అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రిటర్నింగ్ అధికారి యథావిధిగా ఎన్నికలు నిర్వహించగా.. అప్పటికే 4సార్లు MLAగా చేసిన శోభకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అభ్యర్థి మరణిస్తే ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
<<-se>>#ELECTIONS<<>>
Sorry, no posts matched your criteria.