News April 28, 2024

అప్పటివరకు RCB టైటిల్ కొట్టదు: భజ్జీ

image

నాణ్యమైన బౌలర్లు లేనంతవరకూ RCB టైటిల్ సాధించలేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘స్టార్ బ్యాటర్లతో ఎల్లప్పుడూ మ్యాచ్ గెలవలేం. మంచి బౌలర్లు కూడా జట్టులో ఉండాలి. కానీ అలాంటి బౌలింగ్ దళం ఆర్సీబీకి లేదు. వచ్చే వేలంలోనైనా నాణ్యమైన బౌలర్లను తీసుకోవాలి. అప్పుడే జట్టులో సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే ఆర్సీబీ సపోర్టింగ్ సిబ్బందిలో భారతీయుడు ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 5, 2024

అమెరికాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎంతంటే?

image

1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్‌లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.

News November 5, 2024

₹4000+Cr ప్రాఫిట్: 4 ఏళ్లలో తీసుకుంది ఐదుగురినే!

image

Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్‌సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.

News November 5, 2024

తెలంగాణకు టెస్లా రాదా? ఇది అవమానకరం: KTR

image

TG: టెస్లా సంస్థను రాష్ట్రానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు. తమిళనాడు, గుజరాత్, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఏదైనా ఒక రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటయ్యే ఛాన్సుందనే వార్తలపై ఆయన స్పందించారు. తెలంగాణను ఆ సంస్థ కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం అవమానకరమని అన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన సీఎం, మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు.