news

News April 25, 2024

ఐజీగా ఛార్జ్ తీసుకున్న ‘12th ఫెయిల్’ రియల్ హీరో

image

12th ఫెయిల్ మూవీ స్టోరీకి కార‌ణ‌మైన రియ‌ల్ లైఫ్ ఆఫీస‌ర్ మ‌నోజ్ కుమార్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయన ‘కొత్త ఛార్జ్’ అంటూ బాధ్యతలు స్వీకరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు ఇటీవలే ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి లభించింది. 12వ తరగతిలో ఫెయిలైన మనోజ్ కుమార్ తర్వాత ఐపీఎస్ అయ్యి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

News April 25, 2024

IPL: శుభ్‌మన్ గిల్‌కు వందో మ్యాచ్

image

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవాళ ఐపీఎల్‌లో వందో మ్యాచ్ ఆడనున్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌తో ఆయన ఈ ఘనత అందుకోనున్నారు. గిల్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 3,000కుపైగా పరుగులు చేశారు. అందులో 3 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 298 రన్స్ బాదారు.

News April 25, 2024

వారసత్వ పన్ను వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ

image

మరణించిన వ్యక్తుల ఆస్తుల్ని కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని PM మోదీ విమర్శించారు. వారసత్వ పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన <<13113751>>వ్యాఖ్యలపై<<>> మండిపడ్డారు. ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన సంపదపై పన్ను విధించాలని కాంగ్రెస్ అంటోంది. అలా చేస్తే ప్రజలు కష్టపడి సంపాదించిందంతా వారి పిల్లలకు దక్కదు’ అని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

News April 25, 2024

వేసవి సెలవుల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి

image

వేసవి సెలవులు వచ్చేశాయి. హాలిడేస్ అంటే చాలు తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్. ఈ క్రమంలో.. కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

* మిట్టమధ్యాహ్నం పిల్లల్ని బయటికి పంపొద్దు.
* ఫోన్ అలవాటు కాకుండా వారిని ఇండోర్‌ గేమ్స్‌లో తలమునకలుగా ఉంచండి.
* వాహనాల తాళాలు పిల్లలకు తెలియకుండా దాచండి.
* చెరువులు, కాలువల వద్దకు ఒంటరిగా పంపొద్దు.
* నీడ పట్టున స్నేహితులతో ఆడుకునేలా చూడండి.

News April 25, 2024

అల్లర్లు మొదలైతే మోదీదే బాధ్యత: ఒవైసీ

image

ముస్లింలపై ప్రధాని మోదీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముస్లింలపై ద్వేషమేనా మోదీ గ్యారంటీ? 2002 నుంచి ఆయన ఇదే చేస్తున్నారు. రేపు దేశంలో అల్లర్లు మొదలైతే కచ్చితంగా ప్రధానే బాధ్యత వహించాలి. దేశంలో 17కోట్లమంది ముస్లింలున్నారు. వారికి కూడా ఆయనే ప్రధాని. ఈ విధంగా ముస్లింలను ద్వేషించడం దారుణం’ అని వ్యాఖ్యానించారు.

News April 25, 2024

రెమ్యున‌రేష‌న్ లేకుండా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’!

image

రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా మొదలు పెట్టిన ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీని హీరో రామ్ రెమ్యున‌రేష‌న్ లేకుండా చేస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమాకు వ‌చ్చిన లాభాల్లో వాటా తీసుకోవడానికి ఆయన అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. రెమ్యున‌రేష‌న్ కోస‌ం షూటింగ్‌ను ఆపేసిన‌ట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

News April 25, 2024

వెల్త్ సర్వేపై రాహుల్ యూటర్న్

image

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేపడతామన్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. ‘మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకోవాలని అన్నాను. దీనికే దేశాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర అంటూ ప్రధాని మోదీ, BJP ఆరోపిస్తున్నాయి’ అని తెలిపారు. కాగా ఈనెల 7న హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి వస్తే వెల్త్ సర్వే చేస్తామని ప్రకటించారు.

News April 25, 2024

ఏంటీ ‘లుక్ బిట్వీన్’ ట్రెండ్?

image

ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్న ‘లుక్ బిట్వీన్ యువర్ <<13113500>>కీ<<>> బోర్డ్’ ట్రెండ్ కొత్తదేం కాదు. 2021లో K-ON అనే యానిమేటెడ్‌ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి 4Chan అనే వెబ్‌సైట్‌ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది. లుక్ బిట్వీన్ T అండ్‌ O అంటూ ‘YUI’ అనే పాత్రను పరిచయం చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ ట్రెండ్‌ బాగా వైరల్ అవుతోంది.

News April 25, 2024

మా సరిహద్దుల్లో నాటో డ్రిల్స్.. మంచిది కాదు: రష్యా

image

తమ దేశ సరిహద్దుల్లో నాటో కూటమి సైనిక డ్రిల్స్ చేపట్టడం మంచి విషయం కాదని రష్యా తాజాగా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం నుంచి రష్యా-ఫిన్లాండ్ సరిహద్దుల వద్ద నాటో బలగాలు సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నాయి. ఆ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. తమ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా, అందుకు తగినట్లుగా రాజకీయ, సైనిక చర్యల్ని తీసుకుంటామని తేల్చిచెప్పింది.

News April 25, 2024

సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీదే కేంద్రంలో అధికారం: CM రేవంత్

image

TG: సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని CM రేవంత్ అన్నారు. ‘దత్తాత్రేయను అంజన్ కుమార్ ఓడించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు పునరావృతం కాబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రానుంది. దానం నాగేందర్ కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు’ అని సికింద్రాబాద్ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.