News April 25, 2024

మా సరిహద్దుల్లో నాటో డ్రిల్స్.. మంచిది కాదు: రష్యా

image

తమ దేశ సరిహద్దుల్లో నాటో కూటమి సైనిక డ్రిల్స్ చేపట్టడం మంచి విషయం కాదని రష్యా తాజాగా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం నుంచి రష్యా-ఫిన్లాండ్ సరిహద్దుల వద్ద నాటో బలగాలు సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నాయి. ఆ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. తమ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా, అందుకు తగినట్లుగా రాజకీయ, సైనిక చర్యల్ని తీసుకుంటామని తేల్చిచెప్పింది.

Similar News

News January 25, 2025

BREAKING: VSR రాజీనామా

image

AP: వైసీపీ కీలక నేత, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న VSR ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2028 వరకు ఉంది.

News January 25, 2025

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 OCTలో గవర్నర్‌గా నియమితులయ్యారు.

News January 25, 2025

చంద్రబాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

image

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తనకు తన ‘సోర్స్ కోడ్’ బుక్‌ను ఇచ్చారని AP CM చంద్రబాబు తెలిపారు. కాలేజీని వదిలి మైక్రో‌సాఫ్ట్‌ను ఎలా ప్రారంభించారు? ఆయన జర్నీకి సంబంధించిన అనుభవాలు, పాఠాలను ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ బుక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. బిల్ గేట్స్‌కు ఆల్ ది బెస్ట్‌తో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల దావోస్‌లో వీరిద్దరూ భేటీ అయిన సంగతి తెలిసిందే.