news

News March 30, 2024

మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ముయిజ్జు తీవ్ర ఆగ్రహం

image

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌పై ప్రత్యక్షంగా, భారత్‌పై పరోక్షంగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఇబ్రహీం అధికారంలో ఉన్న సమయంలో వారికి పార్లమెంటులో అత్యధిక మెజారిటీ ఉంది. కానీ దేశ స్వతంత్రతను కాపాడటంతో విఫలమయ్యారు. భద్రతను విదేశీ పాలకుల చేతిలో పెట్టారు. ఆ రాయబారుల ఆదేశాలకు అనుగుణంగా పాలించారు. దానివల్ల కోలుకోలేని విధ్వంసం జరిగింది’ అని మండిపడ్డారు.

News March 30, 2024

తులసి గింజలతో ఎన్ని ఉపయోగాలో!

image

ఆధ్యాత్మికపరంగానే కాక వైద్యపరంగానూ తులసి మొక్కకు చాలా ప్రాశస్త్యం ఉంది. ప్రధానంగా తులసి గింజల వలన చాలా ఉపయోగాలున్నాయట. ‘జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు లభిస్తాయి. జీర్ణశక్తి మెరుగుదల, ఎసిడిటీ, గ్యాస్‌ నియంత్రణ వంటి ఫలితాలు ఉంటాయి. మలబద్ధకానికి సహజసిద్ధమైన ఔషధం తులసి గింజలు’ అంటున్నారు నిపుణులు.

News March 30, 2024

‘ఘర్షణ’ డేనియల్ బాలాజీ కన్నుమూత

image

తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్టయాడు విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. తెలుగులో వెంకటేశ్ ‘ఘర్షణ’ సినిమాలో పోలీసు పాత్రలో కనిపించారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు నెట్టింట బాలాజీకి తమ నివాళులర్పిస్తున్నారు.

News March 30, 2024

ఏపీ స్పీకర్‌కు వ్యతిరేక పవనాలు!

image

ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేనికి సొంత పార్టీ నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. స్థానికంగా వైసీపీ కీలక నేత సువ్వారి గాంధీకి, తమ్మినేనికి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే సీతారాంకు టికెట్ ఇవ్వడాన్ని గాంధీ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు గాంధీ దంపతులు, సంబంధీకులు రాజీనామాలు చేసేశారు. స్వతంత్రంగా బరిలో దిగుతామంటున్నారు. దీంతో 20వేల వరకు ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది.

News March 30, 2024

ఆర్సీబీకి కొరకరాని కొయ్యగా కోల్‌కతా

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తన రికార్డు నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరుపై నెగ్గింది. సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2016 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాకు ఓటమే ఎదురుకాలేదు. ఈ స్టేడియం కేకేఆర్‌కు సొంత మైదానంలా మారింది.

News March 30, 2024

శర్వానంద్ సినిమాకు బాలయ్య మూవీ టైటిల్?

image

యువనటుడు శర్వానంద్ ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను వాడుకోవాలని అనుకుంటున్నారట మూవీ టీమ్. అబ్బరాజు తన గత సినిమాకు కూడా సామజవరగమన వంటి అచ్చ తెలుగు టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.

News March 30, 2024

నాకు తండ్రి కావాలని ఉంది: విజయ్ దేవరకొండ

image

తనకు తండ్రి కావాలని ఉందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నేను చేసుకోబోయే అమ్మాయి నా తల్లిదండ్రులకు నచ్చాలి. అప్పుడు వివాహం చేసుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా విజయ్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ వచ్చే నెల 5న విడుదల కానుంది.

News March 30, 2024

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా?

image

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై యాజమాన్యం వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అతడిపై ముంబై ఫ్రాంచైజీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు ఓటములకు అతడే కారణమని భావిస్తున్నట్లు టాక్. దీంతో ఆ జట్టు పగ్గాలను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేనేజ్‌మెంట్ తీవ్ర ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్‌లో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.

News March 30, 2024

మళ్లీ హైజాక్.. రంగంలోకి భారత నేవీ

image

అరేబియా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. ఇరాన్‌‌కు చెందిన బోటుపై దాడి చేసిన 9మంది సాయుధ సముద్రపు దొంగలు, దాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యెమెన్‌కు సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న భారత నేవీ అరేబియా సముద్రంలో రంగంలోకి దిగింది. ఆపరేషన్ కొనసాగుతోందని, నౌకను రక్షిస్తామని అధికారులు తెలిపారు.

News March 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.