News March 30, 2024
‘ఘర్షణ’ డేనియల్ బాలాజీ కన్నుమూత
తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్టయాడు విలయాడు, వడా చెన్నై వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. తెలుగులో వెంకటేశ్ ‘ఘర్షణ’ సినిమాలో పోలీసు పాత్రలో కనిపించారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు నెట్టింట బాలాజీకి తమ నివాళులర్పిస్తున్నారు.
Similar News
News January 16, 2025
ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్: 6 వారాల తర్వాత ఏం జరుగుతుందంటే?
ఇజ్రాయెల్-గాజా సీజ్‌ఫైర్ 3 దశల్లో కొనసాగుతుందని హమాస్ విడుదల చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. మొదటి దశ 6 వారాలు ఉంటుంది. వారానికి కొందరు చొప్పున చివరి వారం బందీలందరినీ హమాస్ విడుదల చేస్తుంది. రెండో వారం మిలిటరీ ఆపరేషన్స్ శాశ్వతంగా ఆగిపోతాయి. ఇజ్రాయెల్, గాజా పరస్పరం పౌరులు, సైనికుల్ని విడుదల చేస్తాయి. మూడో దశలో మృతదేహాలు, అస్థికలను ఇస్తారు. ఆ తర్వాత 3-5 ఏళ్లలో గాజా పునర్నిర్మాణం మొదలవ్వాలి.
News January 16, 2025
సైఫ్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.
News January 16, 2025
Stock Markets: బెంచ్‌మార్క్ సూచీల దూకుడు
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హిండెన్‌బర్గ్ షట్‌డౌన్ అంశాలు పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. నిఫ్టీ 23,350 (+136), సెన్సెక్స్ 77,174 (+444) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, రియాల్టి సూచీలు కళకళలాడుతున్నాయి. అదానీ షేర్లు పుంజుకున్నాయి. HDFCLIFE, ADANISEZ, SBILIFE, ADANIENT, SRIRAMFIN టాప్ గెయినర్స్.