India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ మహిళకు షాక్ ఇచ్చింది. ఆమె తన భర్తతో పాటు మరి కొందరిపై వేర్వేరుగా రేప్ కేసులు పెట్టింది. అయితే ఓ వ్యక్తిని ఆర్థికంగా మోసం చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణలో భాగంగా ఆమె గతంలో పెట్టిన తప్పుడు రేప్ కేసుల విషయాలు బయటికొచ్చాయి. ఇది తెలుసుకున్న కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

కర్ణాటక విజయపూర్ జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల సాత్విక్‌ను సురక్షితంగా బయటికి తీసుకురావడంపై మాజీ సీఎం కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా కఠినమైన, సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్. పిల్లాడు ప్రాణాలతో బయటపడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను రక్షించిన NDRF, SDRF, ఫైర్ & పోలీసు సిబ్బందికి తల్లిదండ్రులే కాకుండా దేశం మొత్తం రుణపడి ఉంటుంది. అందరికీ అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

గాయంతో కొంతకాలంగా క్రికెట్‌కు దూరమైన సూర్య కుమార్ యాదవ్ తిరిగి గ్రౌండ్‌లోకి దిగనున్నారు. IPLలో ఆడేందుకు అతనికి NCA నుంచి NOC జారీ అయింది. దీంతో రేపు ముంబై ఇండియన్స్ జట్టులో అతను చేరనున్నట్లు CRICBUZZ పేర్కొంది. నెట్ సెషన్‌లో అతడి ఆటను ముంబై మేనేజ్‌మెంట్ పరిశీలించనుంది. ఈనెల 7న ఢిల్లీతో జరగనున్న మ్యాచులో సూర్యను ఆడించాలా లేదా అనేది అతడి ఫిట్‌నెస్‌ను బట్టి నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

☛ కలెక్టర్లు:
★ అనంతపురం: వి.వినోద్ కుమార్ ★ కృష్ణా: డీకే బాలాజీ
★ తిరుపతి: ప్రవీణ్ కుమార్
☛ ఎస్పీలు:
★ ప్రకాశం: గరుడ్ సుమిత్ సునీల్
★ చిత్తూరు: మణికంఠ చెందోలు
★ నెల్లూరు: ఆరిఫ్ హఫీజ్
★ పల్నాడు: బిందు మాధవ్
★ అనంతపురం: అమిత్ బర్దార్

ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉ.10.30 గంటలకు తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కుమారుడిని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. అటు సాధారణ బెయిల్ విచారణను ఏప్రిల్ 20న చేపడతామని కోర్టు తెలిపింది.

దేశాన్ని నిర్మించేదెవరో, నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ‘కాంగ్రెస్ అంటే యువతకు తొలి ఉద్యోగం, MSP గ్యారంటీ, పేద మహిళలను మిలియనీర్లుగా మార్చడం, కులగణన, కార్మికుల దినసరి కూలీ రూ.400, రాజ్యాంగ-పౌర హక్కుల పరిరక్షణ. BJP అంటే నిరుద్యోగం, రైతులకు రుణభారం, వివక్ష, నియంతృత్వం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకోండి’ అని పేర్కొన్నారు.

TG: ఒకటి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే SA-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. వీటిని ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1-7 తరగతుల విద్యార్థులకు ఉ.9-11.30 గంటల వరకు, 8వ తరగతి వాళ్లకు ఉ.9-11.45 గంటల వరకు, 9వ తరగతి స్టూడెంట్స్‌కు ఉ.9-12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొంది. 23న ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తామంది. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనుంది.

AP: రైల్వేకోడూరు జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ మార్చారు. రైల్వేకోడూరు నుంచి అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించారు. యనమల భాస్కర్ రావు స్థానంలో శ్రీధర్‌కు టికెట్ ఇచ్చారు. సర్వేల్లో భాస్కర్ రావుకు సానుకూల ఫలితాలు రానందుకే ఆయనను మార్చినట్లు తెలుస్తోంది. అరవ శ్రీధర్ ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్‌గా ఉన్నారు. మూడు రోజుల క్రితమే ఆయన జనసేనలో చేరారు.

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారని వాదించారు. లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితేనని, అప్రూవర్‌గా మారిన వ్యక్తిని బెదిరించారని తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని, ఫోన్లలో డేటా డిలీట్ చేసి ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, మహిళగా, చట్టసభ సభ్యురాలిగా కవితకు బెయిల్ ఇవ్వొచ్చని ఆమె న్యాయవాది వాదించారు.

వాట్సాప్‌లో వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్‌లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో యాప్‌లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్‌కి మారినప్పుడు కూడా ఈ మోడ్‌లో వీడియోలను చూసే వీలుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.
Sorry, no posts matched your criteria.