News April 4, 2024
మీకు దేశం మొత్తం రుణపడి ఉంటుంది: EX CM

కర్ణాటక విజయపూర్ జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల సాత్విక్‌ను సురక్షితంగా బయటికి తీసుకురావడంపై మాజీ సీఎం కుమారస్వామి హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా కఠినమైన, సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్. పిల్లాడు ప్రాణాలతో బయటపడినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను రక్షించిన NDRF, SDRF, ఫైర్ & పోలీసు సిబ్బందికి తల్లిదండ్రులే కాకుండా దేశం మొత్తం రుణపడి ఉంటుంది. అందరికీ అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 19, 2026
నాసా ఫొటో.. వెలుగు జిలుగుల్లో యూపీ, బిహార్!

భూమి నైట్ లైఫ్‌పై NASA ఇటీవల రిలీజ్ చేసిన ఇమేజెస్ వైరలవుతున్నాయి. ఇందులో భారత్.. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్‌లు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. 2014-2022 మధ్య తొమ్మిదేళ్ల పాటు రాత్రి వేళ ఉపగ్రహాలు తీసిన 1.16 మిలియన్ శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా నాసా వీటిని రిలీజ్ చేసింది. వెనుకబడిన రాష్ట్రంగా పరిగణించే బిహార్ విద్యుత్ వెలుగుల్లో టాప్‌లో ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రేపు సీఎం vs మాజీ సీఎం

TG: చాలా రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. రేపు CM, మాజీ CM బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ భూపాలపల్లి (D) కాటారంలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అటు జీవన్ రెడ్డి BRSలో చేరిక సందర్భంగా జగిత్యాల సభకు KCR హాజరుకానున్నారు. ఆయన అధికార పార్టీపై ఎలాంటి విమర్శనాస్త్రాలతో వస్తారనేది ఆసక్తికరంగా మారింది.