news

News April 7, 2024

సైబర్ క్రైమ్‌కు ‘ఫ్యామిలీ స్టార్’ బృందం ఫిర్యాదు

image

తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెట్టింట తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని కోరింది. సినిమాపై నెగటివ్ ట్రోలింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా వారికి సమర్పించినట్లు సమాచారం. మరోవైపు సినిమా నిర్మాత దిల్ రాజు సైతం ప్రెస్‌మీట్‌లో ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News April 7, 2024

MPC, BiPC విద్యార్థులకు BIG ALERT

image

TG: EAPCET-2024 దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లు సరిచేసుకునే అవకాశాన్ని JNTUH కల్పిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు వెబ్‌సైటులో కరెక్షన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పేమెంట్ ఐడీ, మొబైల్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. అన్ని వివరాలు ఎడిట్ చేశాక.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అటు రూ.250 జరిమానాతో APR 9వ తేదీ వరకు, రూ.5000 ఫైన్‌తో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

News April 7, 2024

GTvsLSG: గుజరాత్ టార్గెట్ 164 రన్స్

image

GTతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ 58, కేఎల్ రాహుల్ 33, నికోలస్ పూరన్ 32*, ఆయుష్ బదోని 20 రన్స్‌తో రాణించారు. ఉమేశ్ యాదవ్, దర్శన్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

News April 7, 2024

మోదీ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారు: జైరాం రమేశ్

image

పదేళ్లుగా ఎలాంటి హామీలూ నెరవేర్చని ప్రధాని మోదీ.. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. మోదీ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ‘పాంచ్ న్యాయ్ పచీస్ గ్యారంటీ’ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని పేర్కొన్నారు.

News April 7, 2024

IPL: T20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు

image

ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై సరికొత్త రికార్డు సృష్టించింది. T20 మ్యాచ్‌లో ఆటగాళ్లెవరూ హాఫ్ సెంచరీ చేయకుండా అత్యధిక స్కోర్(234) చేసిన జట్టుగా ఘనత సాధించింది. రోహిత్ 49, టిమ్ డేవిడ్ 45*, ఇషాన్ 42, హార్దిక్ 39, షెఫర్డ్ 39* రన్స్ చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ T20 బ్లాస్ట్ టోర్నీ-2018లో సొమర్‌సెట్ జట్టు చేసిన 226 పరుగుల రికార్డును(ఒక్క ఫిఫ్టీ కూడా లేకుండా) ముంబై బ్రేక్ చేసింది.

News April 7, 2024

కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత?

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS అభ్యర్థిగా నివేదిత పేరును KCR ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే మరోసారి ఈ టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ MLA లాస్య నందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా శ్రీ గణేశ్ పేరును ప్రకటించింది.

News April 7, 2024

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. 15 వరకు ఛాన్స్

image

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 15న సా.5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2024 నాటికి ఆరేళ్లు పూర్తయిన పిల్లలు అర్హులు. రిజిస్ట్రేషన్ తర్వాత ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను ఈ నెల 19న, RTE/సర్వీస్ ప్రియారిటీ/రిజర్వేషన్ కోటా జాబితాను 29న, మూడో ప్రొవిజినల్ లిస్టును మే 8న విడుదల చేస్తారు.
సైట్: <>https://kvsonlineadmission.kvs.gov.in/<<>>

News April 7, 2024

9,144 రైల్వే ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 జాబ్స్ 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్‌-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను <>https://indianrailways.gov.in<<>> సంప్రదించాలి.

News April 7, 2024

అమెరికాకు పోటీగా చైనా సైనిక విన్యాసాలు

image

దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు వైఖరికి కళ్లెం వేసేందుకు అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా తాజాగా సంయుక్త విన్యాసాలు ప్రారంభించాయి. అయితే వాటికి పోటీగా చైనా కూడా వెంటనే అదే సముద్రంలో విన్యాసాల్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. తమ నేవీ, వైమానిక దళాలు ఇందులో పాల్గొన్నాయని బీజింగ్ స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

News April 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం: పవన్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సాధారణ ప్రజలు సైతం కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘ఇది నేను ఒక్కడినే చేసే పని కాదు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్న అంశమిది. అందరూ కలిసి రోడ్లపైకి రావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం మా కూటమి లక్ష్యం. ఉద్దానం సమస్య తీరేందుకు పోరాడినట్లే దీని కోసం బలంగా నిలబడదాం’ అని ఆకాంక్షించారు.