India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మూవీ షూటింగ్‌తో మొన్న SRH ఇన్నింగ్స్ చూడలేకపోయానని రాహుల్ ట్వీట్ చేశారు. దీంతో రాహుల్ మ్యాచ్ చూడొద్దని.. ఆ సమయంలో షూట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పలువురు సూచించారు. మరోవైపు రష్మికను ట్యాగ్ చేస్తూ షూట్ కోసం డేట్స్ ఇవ్వాలని రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ తాను RCB ఫ్యాన్ అయినప్పటికీ ఇవాళ SRH గెలవాలని కోరుకుంటున్నానని.. స్కైప్‌లో షూట్ చేద్దామని రాహుల్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చారు.

ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్ బుక్ చేయగా రాయి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అతడు రూ.22 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా లోపల రాయి కనిపించింది. దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది.

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే CUET-UG-2024 <

తన భర్త సింహమని, ఆయన్ను జైల్లో ఎక్కువ కాలం ఉంచలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో తన భర్త పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. ‘కేజ్రీవాల్ అనే నేను నాకు ఓటు వేయాలని మిమ్మల్ని కోరడం లేదు. కొత్త ఇండియా కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. భరతమాత బాధలో ఉంది. ప్రతిపక్ష కూటమికి ఛాన్స్ ఇవ్వండి. కొత్త ఇండియాను నిర్మిస్తాం’ అని తెలిపారు.

త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ సినిమా చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. ‘నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా వచ్చే నాలుగేళ్లలోపు ఓ భారీ సినిమాను చేయాలనుకుంటున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని, దర్శకుడు శంకర్ ఓకే చెప్పగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచులకు దూరమైన హసరంగ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఢిల్లీలోని ఓ ఫ్లై ఓవర్‌పై ఇద్దరు ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్డు మధ్యలో కారు ఆపి రీల్స్ షూట్ చేశారు. ట్రాఫిక్ స్తంభించిపోయినా లెక్క చేయకుండా కారు డోర్ తెరిచి ప్రయాణం చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి రూ.36వేల ఫైన్ విధించారు. అయినా తగ్గని నిందితులు పోలీసులపైనా దాడికి తెగబడ్డారు. దీంతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారి కారులో కొన్ని నకిలీ ఆయుధాలను కూడా గుర్తించినట్లు సమాచారం.

AP: టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కళావతమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు ఆమెకు నివాళులర్పించారు. కాగా ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి సమయాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి ఉంటుందని అంచనా వేసింది. ఎల్లుండి నుంచి పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP: దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు.. ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ ప్రభుత్వ కుట్ర. ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. అదానీ, అంబానీల అనుచరులకు జగన్ పదవులు కట్టబెడుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.