news

News March 27, 2024

విశాఖ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం జగన్

image

AP: విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. ‘చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రైఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ రైడ్స్ చేసింది. దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు, వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు.. తోసేది మన మీదికి’ అని జగన్ మండిపడ్డారు.

News March 27, 2024

హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

image

TG: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా హైకోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల స్థలాన్ని, బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించింది.

News March 27, 2024

టాస్ గెలిచిన ముంబై.. ఏం ఎంచుకుందంటే?

image

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్‌శర్మ, ఇషాన్‌కిషన్, తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్య(C), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్జీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.
SRH: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్‌శర్మ, మార్క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉనద్కత్.

News March 27, 2024

FLASH: వివేకా మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

image

AP: మాజీ మంత్రి వివేకానంద మరణంపై CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో? వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు. వాడిని చంద్రబాబు, అతడి ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయి’ అని ఆరోపించారు.

News March 27, 2024

భారత సంతతి డాక్టర్‌కు ఎలాన్ మస్క్ సాయం

image

కెనడాలోని డా.కుల్వీందర్ కౌర్ గిల్‌‌ అనే భారత సంతతి వైద్యురాలికి X (ట్విటర్) అండగా నిలిచింది. ప్రభుత్వంపై ఆమె పోరాడుతున్న కేసుకు సంబంధించిన ఫీజు $3,00,000ను (రూ.2.4కోట్లు) తామే భరించనున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడాన్ని తప్పుపడుతూ కుల్వీందర్ ట్విటర్‌లో పోస్టులు చేశారు. తాజాగా ఫీజు చెల్లించేందుకు ఆమె క్రౌడ్ ఫండింగ్‌కు పిలుపునివ్వగా మస్క్ ఇందుకు సానుకూలంగా స్పందించారు.

News March 27, 2024

సీఎంకు హైకోర్టు షాక్

image

లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ, మధ్యంతర బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని EDని ఆదేశించింది.

News March 27, 2024

అప్పుడు నిద్రలేని రాత్రులు గడిపా: కరీనా

image

ఒకప్పుడు తనకు వరుస పరాజయాలు ఎదురై నిద్రలేని రాత్రులు గడిపినట్లు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తెలిపారు. తాను నటించిన ‘క్రూ’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘పాతికేళ్ల నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నా సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అయ్యేవి. హిట్స్ కంటే డిజాస్టర్స్‌తో అందరికీ తెలిసిపోయా. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేదాన్ని. నేను కాబట్టి తట్టుకోగలిగాను’ అని ఆమె తెలిపారు.

News March 27, 2024

BREAKING: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

image

AP: ఏప్రిల్, మే నెలల పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్ప్ కీలక ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని.. ఫొటోలు, వీడియోలు తీయొద్దని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ స్పష్టం చేసింది.

News March 27, 2024

రాష్ట్రంలో భానుడి భగభగలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ ఎండలు దంచికొట్టాయి. భానుడి భగభగతో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎండల తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 27, 2024

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

image

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ సీఈసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఇందులో చర్చించనున్నారు. భేటీ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.