India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత్ రెండో వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని 13 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నిజమైంది. 100 కోట్లకు పైగా అభిమానుల మద్దతుతో ఈ జ్ఞాపకాలను అందించిన జట్టుకు కృతజ్ఞతతో ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా ఈ టోర్నీలో సచిన్ 482 పరుగులు చేశారు.

తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన దళపతి విజయ్‌కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(గోట్) సినిమాయే ఆఖరిది అని వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నానని, అదే తనకు ఆఖరిదని విజయ్ ప్రకటించారు. పూర్తిగా రాజకీయ కోణంలో సాగే ఓ కథను హెచ్ వినోత్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్‌గా ఉంటుందని దళపతి భావించినట్లు తెలుస్తోంది.

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావు.. వాళ్లది ట్యాపింగ్ ఫ్యామిలీ అని విమర్శించారు. కేసీఆర్ చేసిన పాపాలకు రాష్ట్రంలో వర్షాలు పడలేదన్నారు. హరీశ్ రావు మాటలకు అర్థం లేదని దుయ్యబట్టారు.

TG: మన్నెగూడ భూవివాదంలో కేసీఆర్ బంధువు అరెస్టయ్యారు. భూవివాదం కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 3న ఆదిభట్ల పీఎస్‌లో కన్నారావుపై కేసు నమోదైంది. మన్నెగూడలో రెండెకరాల భూమి కబ్జాకు యత్నించినట్లు కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా హైకోర్టు తిరస్కరించింది.

AP: కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తన మద్దతు ఉంటుందని దివంగత వివేకా కుమార్తె సునీత వెల్లడించారు. ‘జగన్ జైలుకెళ్లినప్పుడు పాదయాత్ర చేసి ఆమె వైసీపీని గెలిపించింది. దీంతో తనకంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డారు. షర్మిలను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని వివేకా గతంలో అనుకునేవారు. షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? జగన్ సమాధానం చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

TG: బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీంతో తెల్లం పార్టీ మారనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్‌తో పాటు ఇతర నేతలతోనూ పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌లోని కొర్చోలీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో ఉదయం నలుగురు మృతిచెందగా.. మరణాల సంఖ్య తాజాగా 8కి చేరినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీ ఆటో మెషీన్‌గన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

TG: ఏప్రిల్ 8వ తేదీ నుంచి స్కూళ్లలో SA-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) తెలిపారు. టికెట్ ఇస్తే మెజారిటీతో గెలుస్తానన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరున్నారో తెలియాలని.. ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యాసిడ్ దాడి బాధితులను కలిశారు. బిజీ షెడ్యూల్‌లోనూ ఆమె అతిజీవన్ ఫౌండేషన్‌కు వచ్చారని సామాజిక కార్యకర్త ప్రగ్యా ప్రసూన్ తెలిపారు. యాసిడ్ విక్టిమ్స్‌తో ప్రియాంక మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. వారితో ఆమె దిగిన ఫొటోలను ప్రగ్యా ఇన్‌స్టాలో పంచుకున్నారు. బాధితుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ముందుకొచ్చినందుకు ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.