news

News March 24, 2024

సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ భారీ స్కోర్

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 193 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 82* రన్స్‌తో రాణించారు. రియాన్ 43, జైస్వాల్ 24, జురెల్ 20* చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ 2, మోసిన్ ఖాన్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. లక్నో విజయానికి 20 ఓవర్లలో 194 రన్స్ అవసరం.

News March 24, 2024

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: మోదీ

image

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సద్భావం అనే రంగులు కలగలిసిన ఈ పండగ మీ అందరి జీవితాలలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News March 24, 2024

నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోను: సంతోష్

image

TG: ఫోర్జరీ కేసుపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ స్పందించారు. షేక్‌పేటలో స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఫోర్జరీ అనేది అవాస్తవమన్నారు. న్యాయపరమైన సమస్య ఉంటే లీగల్ నోటీసులు ఇవ్వాలి గానీ, పీఎస్‌లో ఫోర్జరీ కేసు పెట్టడం సరికాదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై బురద జల్లాలని చూస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోనని సంతోష్ హెచ్చరించారు.

News March 24, 2024

ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ

image

ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఓటర్ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ప్రజల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.

News March 24, 2024

సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువు నష్టం దావా

image

AP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువునష్టం దావా వేశారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములమంటూ ప్రచురితమైన వార్తపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల్లేకుండా వార్త ప్రచురించినందుకు సాక్షి న్యూస్ పేపర్ యాజమాన్యానికి పురందీశ్వరి లాయర్ నోటీసులు పంపించారు.

News March 24, 2024

దేశంలో 370 సీట్లు.. ప్రతి బూత్‌లో 370 ఓట్లు: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో 17 స్థానాలు కాంగ్రెస్ గెలవదని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని రాష్ట్ర BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. పదాధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు.. ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు BJPకి వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఏప్రిల్ 6న రాష్ట్రంలోని ప్రతి బూత్‌లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని సూచించారు.

News March 24, 2024

గేట్లు తెరవాల్సింది రైతుల కోసం: హరీశ్‌

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS MLA హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. CM గేట్లు తెరవాల్సింది నేతల కోసం కాదని, రైతుల కోసమని సూచించారు. నీళ్లు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వారి ఇళ్లకు వెళుతున్న CM రైతుల ఇళ్లకు మాత్రం వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో 100రోజుల్లో 180మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

News March 24, 2024

సికింద్రాబాద్‌లో గెలిచేది నేనే: పద్మారావు

image

TG: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచేది తానేనని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ‘గెలుపుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను సికింద్రాబాద్‌‌లో నిన్న, మొన్నటి నుంచి ఉంటున్న వ్యక్తిని కాదు.. 35ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా. సికింద్రాబాద్‌లోనే కాదు.. హైదరాబాద్‌ మొత్తం ఎక్కడ నా పేరు చెప్పినా నేనేంటో తెలుస్తుంది’ అని అన్నారు.

News March 24, 2024

ఆయన నుంచి చాలా నేర్చుకున్నా: గిల్

image

రోహిత్ శర్మ నుంచి చాలా నేర్చుకున్నానని గుజరాత్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడానని చెప్పారు. రోహిత్ నుంచి వ్యక్తిగతంగా అనేక లక్షణాలను అలవరచుకున్నానని తెలిపారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తనకు స్ఫూర్తి అని చెప్పారు. అయితే ధోనీ నాయకత్వంలో ఆడలేకపోయానని.. విరాట్ సారథ్యంలో కొన్ని మ్యాచులు ఆడానని పేర్కొన్నారు.

News March 24, 2024

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా.. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.