News March 24, 2024
సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువు నష్టం దావా

AP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి సాక్షి పేపర్‌పై రూ.20కోట్ల పరువునష్టం దావా వేశారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో తాము భాగస్వాములమంటూ ప్రచురితమైన వార్తపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల్లేకుండా వార్త ప్రచురించినందుకు సాక్షి న్యూస్ పేపర్ యాజమాన్యానికి పురందీశ్వరి లాయర్ నోటీసులు పంపించారు.
Similar News
News March 5, 2026
భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.
News March 5, 2026
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


