news

News April 2, 2024

BIG BREAKING: స్కూళ్లకు వేసవి సెలవులు

image

AP: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినమని వెల్లడించింది.

News April 2, 2024

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన KTR

image

TG: తనపై వస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై KTR స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తనపై నిరాధార వార్త రాసిన పత్రికపైనా ఫిర్యాదు చేస్తానన్నారు.

News April 2, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో జుడీషియల్ రిమాండ్‌కు నిందితులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిద్దరికి ఈ నెల 6వరకు రిమాండ్ విధించింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.

News April 2, 2024

GET READY: సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ రానుంది. పుష్ప మాస్ జాతర ఈరోజు నుంచి మొదలుకానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ అప్డేట్ ఏంటా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ బర్త్ డే (APR 8) ఉండటంతో ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు ఏదైనా సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.

News April 2, 2024

తెలంగాణలో ‘కరవు’ రాజకీయాలు

image

రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్లే కరవు వచ్చిందని ప్రతిపక్ష BRS ఆరోపిస్తుంటే.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమే అని కాంగ్రెస్ అంటోంది. ఎండిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే.. అసెంబ్లీకి రాని కేసీఆర్ అరెకరం కోసం రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను గాలికి వదిలేసి ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

News April 2, 2024

ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా: రఘురామ

image

ప్రజల కోసమే సీఎం జగన్‌తో తాను ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామక‌ృష్ణరాజు తెలిపారు. ‘జగన్‌పై ఉన్న కేసుల్లో ఏ పురోగతీ లేకపోవడం దురద‌ృష్టకరం. రాష్ట్రం నుంచి ఎవరూ స్పందించకపోయినా నేను కోర్టులో పిటిషన్ వేశాను. అందుకే జగన్ నన్ను చంపించే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నాను. కూటమి ఏర్పాటు కోసం నేను ఎన్నో రోజులు ఢిల్లీలో ఉండి రహస్యంగా కృషి చేశాను’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

ఈ ఫలితాన్ని ఊహించలేదు: హార్దిక్

image

నిన్నటి మ్యాచులో రాజస్థాన్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచులో ఈ ఫలితాన్ని ఊహించలేదని చెప్పారు. కోరుకున్న విధంగా ఆరంభం దక్కలేదన్నారు. రాబోయే మ్యాచుల్లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉందన్నారు. దీని కోసం ధైర్యంగా ఆడాల్సి ఉంటుందన్నారు.

News April 2, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

image

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 12న జీ 5 OTTలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగిత విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అభినయ, సమద్ తదితరులు నటించారు.

News April 2, 2024

ముఖంపై త్రివర్ణ పతాకం.. ఆలయంలోకి నో పర్మిషన్!

image

అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌ సిబ్బంది భక్తులతో ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జాతీయ జెండాను ఫేస్‌పెయింట్ వేసుకున్న తనను టెంపుల్‌లోనికి అనుమతించలేదని ఓ నెటిజన్ రెడిట్‌లో పోస్ట్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. గేటు వద్ద ఉన్న సిబ్బంది కూడా మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. అయితే, 2023లోనూ ఓ యువతికి ఇలాంటి ఘటనే ఎదురైందని మరో నెటిజన్ గుర్తు చేశారు.

News April 2, 2024

ఆ ముగ్గురిలో ఎంపీ టికెట్ దక్కేదెవరికో?

image

TG: సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీ మారడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిపై BRS కసరత్తు చేస్తోంది. పార్టీ మారిన మూడు రోజులకే కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమెను ఓడించేందుకు తగిన ప్రత్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో మాజీ MLA రాజయ్య, పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో వేచి చూడాలి.