news

News March 29, 2024

BREAKING: BRSకు ఎంపీ రాజీనామా

image

TG: రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. బాధతోనే బీఆర్ఎస్‌ను వీడుతున్నానని, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ మార్పుపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

News March 29, 2024

రేపటి నుంచి పవన్ ప్రచార సభలు

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచనున్నారు. రేపటి నుంచి 10 నియోజకవర్గాల్లో ఆయన భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం సభల్లో పవన్ ప్రసంగిస్తారు.

News March 29, 2024

వ్యవసాయం చేస్తూ రూ.7.5కోట్లు సంపాదిస్తున్నారు

image

వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలవుతున్నామని బాధపడే రైతులను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే.. అదే వ్యవసాయంలో కొందరు వినూత్న ఆలోచనలతో విజయాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.5కోట్లు సంపాదిస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ కోవకే చెందుతారు. ఇంతకీ ఎవరీ సోదరులు, ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 29, 2024

తెలంగాణ అభివృద్ధికి కేసీఆరే కారణం: KK

image

తెలంగాణను రీడిస్కవర్ చేయాలని KCR ఇచ్చిన పిలుపును ఎప్పటికీ తక్కువగా అంచనా వేయకూడదని ఆ పార్టీ సీనియర్ నేత కేకే అన్నారు. ఈరోజు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటానికి కారణం KCR అని పేర్కొన్నారు. ఇంత చేసినప్పటికీ పార్టీ ఓడటం ఊహించనిదని అన్నారు. కుటుంబ పాలన అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని, పార్టీని నడిపించేందుకు తలసాని వంటి కొందరి పేర్లు తాను ప్రతిపాదించినా వినలేదని కేకే అన్నారు.

News March 29, 2024

ఎంపీ రఘురామ సీటుపై ఉత్కంఠ

image

AP: ఎంపీ రఘురామకృష్ణ రాజు టికెట్‌పై అనిశ్చితి నెలకొంది. ఆయనకు టికెట్ కేటాయించాలని కూటమి పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆయనను ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీడీపీ మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని అసెంబ్లీ లేదా ఎంపీ సీటు ఆయనకు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

News March 29, 2024

IT ఉద్యోగం పోయిందని..

image

దేశంలో కరోనా ఎంతోమందిని రోడ్డున పడేసింది. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల జెస్సీ అగర్వాల్ కూడా కోవిడ్ సమయంలో IT జాబ్ కోల్పోయింది. దీంతో ఆమె దొంగగా మారింది. పేయింగ్ గెస్టుల నుంచి ల్యాప్‌టాప్‌లు కొట్టేసి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసేది. ఓ పేయింగ్ గెస్ట్ ఫిర్యాదుతో జెస్సీ బండారం బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.10 లక్షల విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

News March 29, 2024

నీ ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నా: అల్లు శిరీశ్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సోదరుడు అల్లు శిరీశ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఫొటోలను ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం చూసేందుకు వెళ్లాము. అదే మ్యూజియంలో నీ విగ్రహంతో ఫొటో దిగే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నీ ప్రయాణాన్ని చూసి గర్విస్తున్నా’ అని అల్లుఅర్జున్‌ను ట్యాగ్ చేశారు.

News March 29, 2024

బొత్సను ఢీకొట్టనున్న కళా

image

ఉత్తరాంధ్రలో YCP కీలక నేత బొత్స సత్యనారాయణను TDP నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీకొట్టనున్నారు. బొత్సపై పోటీకి సీనియర్ అయిన కళానే బెటర్ అని TDP భావించింది. అలాగే ప్రస్తుతం TDP చీపురుపల్లి ఇన్‌ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు వెంకట్రావు సొంత పెదనాన్న కావడంతో పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. 2014లో కళా ఎచ్చెర్ల MLAగా గెలిచారు. ఈసారి ఎచ్చెర్ల సీటు BJPకి కేటాయించారు.

News March 29, 2024

FY24లో బిట్‌కాయిన్‌దే ఆధిపత్యం

image

2023-24 ఆర్థిక ఏడాదిలో బిట్‌కాయిన్ హవా కొనసాగింది. FY24 ప్రారంభంలో $28,500గా (రూ.23లక్షలు) ఉన్న బిట్‌కాయిన్ విలువ 150%కుపైగా పెరిగి గరిష్ఠంగా $73,780ను (రూ.61.5లక్షలు) తాకింది. ఈక్విటీలు, బాండ్లు, గోల్డ్‌తో పోలిస్తే ఈ బిట్‌కాయిన్ మంచి రిటర్న్స్ ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన పలు క్రిప్టోల (ఆల్ట్‌కాయిన్స్) విలువ కూడా గరిష్ఠంగా 5,535% పెరిగింది.

News March 29, 2024

చేసిన మంచి అభిమానంలో కనిపిస్తోంది: సీఎం జగన్

image

AP: సీఎం జగన్ ఓ వృద్ధురాలిపై ప్రేమను చాటుకున్నారు. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వృద్ధురాలిని కౌగిలించుకుని ముద్దుపెట్టారు. ‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. వారి సంక్షేమం కోసం పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడవునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తోంది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.