News March 29, 2024

IT ఉద్యోగం పోయిందని..

image

దేశంలో కరోనా ఎంతోమందిని రోడ్డున పడేసింది. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల జెస్సీ అగర్వాల్ కూడా కోవిడ్ సమయంలో IT జాబ్ కోల్పోయింది. దీంతో ఆమె దొంగగా మారింది. పేయింగ్ గెస్టుల నుంచి ల్యాప్‌టాప్‌లు కొట్టేసి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసేది. ఓ పేయింగ్ గెస్ట్ ఫిర్యాదుతో జెస్సీ బండారం బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.10 లక్షల విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 18, 2025

పవన్ ఆఫీస్‌పై డ్రోన్.. డీజీపీకి ఫిర్యాదు

image

AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News January 18, 2025

తిరుమల, తిరుపతిలో అపచారాలు.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

image

AP: తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. అన్ని ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనున్నారు. తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, రూ.300 టికెట్ల స్కామ్, తాజాగా కొండపై ఎగ్ బిర్యానీ కలకలం రేపిన విషయం తెలిసిందే.

News January 18, 2025

వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ప్రచారం అవాస్తవం: డిస్కంలు

image

APCPDCL పరిధిలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని వస్తున్న వార్తలను డిస్కంలు ఖండించాయి. పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో రెండు రోజులుగా కరెంటు సరఫరా సమయాన్ని రీషెడ్యూల్ చేశామని తెలిపాయి. నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.