news

News March 24, 2024

BIG BREAKING: ఏపీ, తెలంగాణ బీజేపీ జాబితా విడుదల

image

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి-పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్‌కుమార్ రెడ్డి, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం-శ్రీనివాస్ వర్మకు టికెట్లు దక్కాయి. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేశ్ పోటీ చేయనున్నారు.

News March 24, 2024

ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్: బీఆర్ఎస్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడను ఆడుతోందని దుయ్యబట్టింది. ప్రతిపక్షాలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన పలువురు బీజేపీకి విరాళాలు ఇచ్చారని.. ఇదిగో సంచలన సాక్ష్యమని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను షేర్ చేసింది.

News March 24, 2024

పెళ్లి చేసుకున్న నటి

image

నటి ఇంద్రజ శంకర్ వివాహం చేసుకున్నారు. తన ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కమెడియన్ రోబో శంకర్ కుమార్తె అయిన ఇంద్రజ.. విజిల్, పాగల్, విరుమాన్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

News March 24, 2024

రిటైర్మెంట్ వెనక్కి..

image

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పాక్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత నిర్ణయించుకున్నానని ట్వీట్ చేశారు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అంతకుముందు ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.

News March 24, 2024

ఒకరోజు షూటింగ్‌కి రూ.కోటి

image

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి తెలిపారు. ‘ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని ₹30 లక్షల బడ్జెట్‌తోనే తీశా. కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్‌లో నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని’ అని చెప్పారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ ₹100 కోట్ల పైనే ఉంటుందని టాక్.

News March 24, 2024

BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ సంచలన విషయాలు

image

TG: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఉన్నతాధికారులు చెబితేనే ఎన్నికలప్పుడు వందలాది ఫోన్లు ట్యాప్ చేశాం. అందులో నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులూ ఉన్నారు. BRS కీలక నేత కొన్ని నంబర్లు ట్యాప్ చేయమన్నారు. మెయిన్ ట్యాపింగ్ డివైజ్‌ను ధ్వంసం చేశాం. కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను విరిచి మూసీ నదిలో పడేశాం. కొన్ని పత్రాలు కాల్చేశాం’ అని తెలిపారు.

News March 24, 2024

ఈ నెల 27న కాంగ్రెస్ తుది జాబితా?

image

TG: కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై ముఖ్య నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. దీనిపై ఏకాభిప్రాయానికి రాష్ట్ర నాయకత్వం యత్నిస్తోంది. ఈ నెల 27న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.

News March 24, 2024

గ్రౌండ్‌లో హార్దిక్.. రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరుపులు

image

టాస్ వేసే సమయంలో అభిమానుల మోతతో స్టేడియం దద్దరిల్లింది. హార్దిక్, గిల్ గ్రౌండ్‌లోకి వెళ్లిన సమయంలో అభిమానులు రోహిత్.. రోహిత్ అంటూ అరిచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. రోహిత్ క్రేజ్ ఇలాగే ఉంటుందంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై యాజమాన్యంపై రోహిత్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

News March 24, 2024

TDPకి జగన్ సన్నిహితుడి కంపెనీ విరాళం!

image

AP: CM జగన్ సన్నిహితుడికి చెందిన కంపెనీ TDPకి భారీ విరాళం ఇచ్చింది. కడపలో పనిచేసే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌లో గత డిసెంబర్‌లో IT సోదాలు జరిగాయి. నెల రోజుల తర్వాత ఆ కంపెనీ TDP కోసం ₹40 కోట్ల బాండ్లు కొనుగోలు చేసింది. AP ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి ఎక్కువ ధరకు ట్రాన్స్‌ఫార్మర్లు కొన్నట్లు TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించిన తర్వాత ఈ బాండ్లు కొనుగోలు చేయడం గమనార్హం.

News March 24, 2024

ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడితే.. మరణమే!

image

మూర్ఛ, నరాల నొప్పి, ఆందోళన వంటి సమస్యలకు ప్రిగాబలిన్ టాబ్లెట్ వాడుతుంటారు. అయితే మోతాదుకు మించి వాడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందట. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈమధ్య ప్రిగాబలిన్ అతిగా వాడి చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఇంగ్లండ్ వైద్యులు చెబుతున్నారు. దీన్ని తీసుకునేవారు ఆల్కహాల్ మానేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మోతాదులో తీసుకుంటే ఏ సమస్య ఉండదని అంటున్నారు.