News March 24, 2024

ఢిల్లీ లిక్కర్ కేసు బోగస్: బీఆర్ఎస్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడను ఆడుతోందని దుయ్యబట్టింది. ప్రతిపక్షాలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన పలువురు బీజేపీకి విరాళాలు ఇచ్చారని.. ఇదిగో సంచలన సాక్ష్యమని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను షేర్ చేసింది.

Similar News

News February 11, 2026

గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

image

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

News February 11, 2026

అమెరికా ‘మ్యాప్’ మాయ.. PoK పోస్ట్‌పై యూటర్న్!

image

PoK, ఆక్సాయ్ చిన్‌తో కలిపి మొత్తం J&Kను <<19072627>>భారత భూభాగం<<>>గా చూపిస్తూ చేసిన SM పోస్ట్‌ను అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్ (USTR) తొలగించింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ గతవారం USTR ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. దీంతో పాక్, చైనా ఆక్రమణలను తిరస్కరిస్తూ ఇండియా పొలిటికల్ మ్యాప్‌ను అమెరికా అధికారికంగా గుర్తించినట్లు అంతా భావించారు.

News February 11, 2026

గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

image

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.