India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జపాన్ పర్యటనలో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి యానిమేపై దృష్టిసారించారు. బాగా ఫేమస్ అయిన జపనీస్ యానిమే గురించి అక్కడి నిపుణులతో చర్చించారు. ‘అద్భుతమైన జపనీస్ యానిమే ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటా. యానిమే గురించి నాకు వివరించిన రుయి కురోకి-సాన్, కజుటో నకాజవా-సాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సృజనాత్మక చర్చలను పూర్తిగా ఆస్వాదించా’ అని ఆయన ట్వీట్ చేశారు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు రానున్నాయి.
* SBI కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి.
* ICICI కార్డులో లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో కనీసం రూ.35వేలు, YES బ్యాంకు కార్డుపై రూ.10వేలు ఖర్చు చేయాలి.
* AXIS కార్డు రివార్డు పాయింట్లు ఇవ్వబోమని తెలిపింది. ఎయిర్‌పోర్టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే 3నెలల్లో రూ.50వేలు ఖర్చు చేయాలి.

AP: పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే టికెట్ వంగా గీతకు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పిండెం దొరబాబుకు సీఎంవో నుంచి పిలుపువచ్చింది. దీంతో దొరబాబు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు బయల్దేరారు. ఆయనతో సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. కాగా, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో వైసీపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.

TG: ‘రజాకార్’ నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్రం భద్రత కల్పించింది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వర్గాల ద్వారా కేంద్రం దర్యాప్తు చేసి నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అఘాయిత్యాలపై తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ ఈ నెల 15న థియేటర్లలో విడుదలైంది.

ఐపీఎల్‌లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబై కెప్టెన్‌గా రోహిత్, చెన్నై కెప్టెన్‌గా ధోనీని IPLలో చూడలేము. వీరిద్దరూ ఐపీఎల్‌లో తమ జట్లకు ఐదేసి ట్రోఫీలను అందించారు. IPL చరిత్రలో ధోనీ, రోహిత్ కలిసి 10 ట్రోఫీలు గెలవగా.. మిగతా అందరూ కెప్టెన్లు కలిపి 6 గెలిచారు. ఇక వీరి వ్యూహాలను ఇకపై మైదానంలో చూడలేమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ‘వి మిస్ యువర్ కెప్టెన్సీ’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ గ్యారంటీ అంటూ కర్ణాటకలో వదంతులు వ్యాపించాయి. దీంతో హుబ్బళ్లి, ఉద్యామ్‌నగర్, నవనగర్, గిర్నిచాల్ తదితర ప్రాంతాల్లోని మహిళలు పోస్టాఫీసులకు పోటెత్తారు. ఇలాంటి పథకమేదీ లేదని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. తమకు అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళలకు నచ్చజెప్పారు.

రేపటి నుంచి IPL ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడం జంపా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో జంపా దూరం కానున్నట్లు సమాచారం. రాజస్థాన్ తరఫున 20 మ్యాచులు ఆడిన అతడు.. 29 వికెట్లు పడగొట్టారు.

1.ధోనీ- 133 విజయాలు (226 మ్యాచులు)
2.రోహిత్ శర్మ- 87 (158)
3.విరాట్ కోహ్లీ- 66 (143)
4.గౌతమ్ గంభీర్- 71 (129)
5.డేవిడ్ వార్నర్- 40 (83)
6.గిల్‌క్రిస్ట్- 35 (74)
7.శ్రేయస్ అయ్యర్- 27 (55)
8.షేన్ వార్న్- 30 (55)

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ED అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.

ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా ధోనీ ప్రస్థానం ముగిసింది. అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే సారథిగా, ప్లేయర్‌గా ధోనీ తప్పుకున్నారు. తాజాగా CSK కెప్టెన్‌గానూ అదే విధంగా వైదొలిగారు. దీంతో ఆయనకు ఇదేం కొత్త కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కెప్టెన్సీలో సీఎస్కే సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.