news

News April 1, 2024

సీఎం జగన్ పెన్షనర్లను రెచ్చగొడుతున్నారు: బొండా

image

AP: సీఎం జగన్ పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని TDP నేత బొండా ఉమ మండిపడ్డారు. వాలంటీర్లను పెన్షన్లు ఇవ్వొద్దని EC ఇచ్చిన ఆదేశాలను అదునుగా చేసుకుని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్లు తప్ప ప్రభుత్వంలో అధికారులే లేరా? అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పర్మినెంట్ చేస్తామని తెలిపారు.

News April 1, 2024

అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. 2 రోజులుగా జ్వరం, దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. పిఠాపురం సభ తర్వాత ఆయన నీరసపడినట్లు సమాచారం. దీంతో ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే పవన్ తదుపరి పర్యటన షెడ్యూల్ ఖరారు చేసేందుకు జనసైనికులు కసరత్తు చేస్తున్నారు.

News April 1, 2024

నేడు అనంత జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ నిర్వహిస్తున్న’మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇవాళ అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. సంజీవపురం నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. రాఘవపల్లి క్రాస్, బత్తలపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా సాగనుంది. కదిరిలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. రాత్రికి చీకటిమానిపల్లెలో బస చేస్తారు.

News April 1, 2024

వానాకాలం ఆరంభంలోనే విత్తనాలు

image

TG: వానాకాలంలో వేయాల్సిన పంటలకు సీజన్ ఆరంభంలోనే అన్ని రకాల విత్తనాలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈమేరకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఏటా వానాకాలం సీజన్‌లో దాదాపు 1.26కోట్ల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ విత్తనాల బెడద ఉంది. రబీ సీజన్‌లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కల్తీ విత్తనాల కట్టడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

News April 1, 2024

ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేనా?

image

IPLలో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఆడిన 2మ్యాచుల్లోనూ గెలిచి రాజస్థాన్‌ జోరు మీదుంది. మరోవైపు ముంబై ఆడిన రెండింట్లోనూ ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉంది. ఈరోజు గెలిచి బోణీ కొట్టాలని MI పట్టుదలతో ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 28మ్యాచుల్లో తలపడగా.. ముంబై 15, రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచాయి. ఒక దాంట్లో ఫలితం రాలేదు.

News April 1, 2024

సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ

image

AP: ఏప్రిల్, మే, జూన్ నెల పింఛన్లను సచివాలయల వద్దే పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్ కార్డు ద్వారా సచివాలయ ఉద్యోగులు నగదు అందిస్తారని సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి తెలిపారు. ఇవి విఫలమైతే రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం ద్వారా అందిస్తారని చెప్పారు. వాలంటీర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు పింఛన్ల పంపిణీలో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

News April 1, 2024

రూ.లక్షలు సంపాదిస్తున్నా పెళ్లిళ్లు కావట్లేదు..

image

కుల, మతాలు, ఆర్థిక స్థితిగతులు వివాహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 30-35 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావట్లేదు. అబ్బాయికి నెలకు రూ.లక్షల జీతం వస్తున్నా.. కుటుంబ ఆస్తులు లేవని అమ్మాయిలు తిరస్కరిస్తున్నారట. మెడిసిన్ చదివిన అబ్బాయిలు తక్కువగా ఉండటంతో MBBS, MD చదివిన అమ్మాయిలకు వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఒకే రంగంలో ఉద్యోగం చేస్తున్నవారినే భాగస్వామిని చేసుకోవాలనే కోరికా వివాహాలపై ప్రభావం చూపుతోంది.

News April 1, 2024

మయామి ఓపెన్ ఛాంపియన్‌గా కోలిన్స్

image

మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ-1000 టోర్నీ ఛాంపియన్‌గా అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కోలిన్స్ నిలిచింది. ఫ్లోరిడాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినాపై విజయం సాధించింది. దీంతో ఆమెకు రూ.9 కోట్ల 16లక్షల ప్రైజ్‌మనీతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కాగా ఈ ఏడాది ఆమె ఆటకు వీడ్కోలు పలకనున్నారు.

News April 1, 2024

ఫైర్ సిబ్బందికి సహాయకులుగా ‘ఆపద మిత్ర’లు

image

తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తున్నట్లు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం DG నాగిరెడ్డి తెలిపారు. స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన చర్యలపై వీరికి శిక్షణ ఇస్తున్నామని.. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకి వస్తారని చెప్పారు. ఫైర్ సిబ్బందికి మంటలార్పే సమయంలో వీరు సహాయకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

News April 1, 2024

నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్దే

image

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాగా ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ చిత్ర షూటింగ్‌లో చైతూ బిజీగా ఉన్నారు.