India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: మార్చి 21, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:07
సూర్యోదయం: ఉదయం గం.6:19
జొహర్: మధ్యాహ్నం గం.12:23
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.39
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేదీ: మార్చి 21, గురువారం,
ఫాల్గుణము
శుద్ధ ద్వాదశి: ఉదయం 04:44 గంటలకు
అశ్లేష: తెల్లవారుజామున 01:27 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:14-11:02 గంటల వరకు,
మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:56-02:23 గంటల వరకు

ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటేనే సంకోచిస్తున్నానని చెప్పారు. కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోందన్నారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్(వేటగాడు)’ మూవీలో రజనీ నటిస్తున్నారు.

* AP: చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి
* వైసీపీని ఇంటికి సాగనంపాలి: చంద్రబాబు
* జగన్, ఆయన సైన్యానికి ఇవే ఆఖరి రోజులు: లోకేశ్
* పవన్ ఎంపీగా పోటీచేస్తే పిఠాపురం నుంచి బరిలోకి దిగుతా: SVSN శర్మ
* TG: నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
* లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా

నిద్రలేమితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
*గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా చూడాలి
*పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి
*నిద్ర పోవడానికి గంట ముందే ఫోన్ పక్కనపెట్టేయండి
*అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి
*రాత్రిపూట కాఫీ, టీ తాగొద్దు.

సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’. ఈ నెల 28న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం 31 కేజీల బరువు తగ్గిన పృథ్వీ.. కొన్ని సార్లు 72 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో కొన్ని మంచినీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగినట్లు పేర్కొన్నారు. శారీరకంగా మార్పు రావడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

టీమ్ ఇండియా మాజీ సారథి ధోనీ ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అన్నారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ డిఫరెంట్ అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ముందే నిర్ణయించుకున్నాడని తెలిపారు. జీవితంలో క్రికెట్ ఓ భాగమేనని గుర్తించి.. అందుకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడన్నారు.

రాజస్థాన్‌లో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు చెమటలు పట్టించింది. శివ్‌పురికి చెందిన కావ్య స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రామాకు తెరతీసింది. చేతులకు కట్లు వేయించుకుని తండ్రికి ఫొటోలు పంపి బెదిరించింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి సింధియా సైతం ఆ యువతిని త్వరగా కాపాడాలని పోలీసులను ఆదేశించారు. చివరకు నాటకం బయటపడింది.

TG: రేవంత్ రెడ్డి సర్కారు 100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసిందని BRS విమర్శించింది. ‘తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నయ్? కాంగ్రెస్ ఖజానాలోకా.. లేక రేవంత్ జేబులోకా?’ అని ట్వీట్ చేసింది. ఇన్ని కోట్ల అప్పులు చేసినా పూర్తిస్థాయిలో రైతుబంధు అందజేయలేదని, పెన్షన్లు పెంచలేదని పోస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.