news

News March 20, 2024

ఉస్తాద్ భగత్‌సింగ్‌పై CEO కీలక వ్యాఖ్యలు

image

AP: DSC నిర్వహణపై విద్యాశాఖ వివరణ కోరామని CEO ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు తెలిపారు. DSC నిర్వహణపై CECకి లేఖ రాస్తామన్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే EC అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 20, 2024

BREAKING: పరీక్ష వాయిదా

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మే 17న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(పాలీసెట్)ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేశారు. మే 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

News March 20, 2024

ఫేక్ ప్రూఫ్‌లతో 21 లక్షల సిమ్ కార్డుల జారీ!

image

దేశంలో ఫేక్ ప్రూఫ్‌ల ఆధారంగా సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయ్యాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ తెలిపింది. అనుమానాస్పద నంబర్లను గుర్తించి వాటి లిస్టును విడుదల చేసింది. వీటికి సంబంధించిన ప్రూఫ్‌లను వెంటనే రీవెరిఫై చేయాలని మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలను ఆదేశించింది. ఒకవేళ అవి ఫేక్ అని తేలితే సిమ్‌లను రద్దు చేయాలని సూచించింది.

News March 20, 2024

ఫిన్‌లాండ్ ప్రజల సంతోషానికి కారణాలివే

image

హెల్తీ వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌, సన్నిహిత సంబంధాలు, ప్రకృతితో మమేకం <<12887705>>వంటివి<<>> ఫిన్‌లాండ్ దేశ ప్రజల సంతోషానికి కారణాలని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్‌ తెలిపారు. ‘ఆర్థిక ఎదుగుదలతోనే జీవితంలో విజయం సాధిస్తామని అక్కడి ప్రజలు నమ్ముతారు. అవినీతిని సహించరు. అక్కడి పాలకులపై ప్రజలకు విపరీతమైన విశ్వాసం ఉంటుంది. ఉచిత వైద్యం, విద్య కూడా ఫిన్‌లాండ్ ప్రజల సంతోషానికి కారణాలు’ అని ఆమె చెప్పారు.

News March 20, 2024

చంద్రబాబు, పవన్‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: బొండా ఉమ

image

AP: పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. నరేందర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు నిరంతరం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా ఉంచారని తెలిపారు. సీఎం జగన్, సజ్జల, పెద్దిరెడ్డిల ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఫైరయ్యారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామని బొండా చెప్పారు.

News March 20, 2024

రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన సబ్ రిజిస్ట్రార్

image

AP: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మడకశిర సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ రైతు తన 6.36 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.50వేల చొప్పున ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. డబ్బు తీసుకునే సమయంలో దామోదర్‌తో పాటు దస్తావేజు లేఖరిని ఏసీబీ పట్టుకుంది.

News March 20, 2024

లెక్కలు సెటిల్ చేస్తున్న అనిల్ అంబానీ!

image

గతంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ఏడాది వ్యవధిలో రిలయన్స్ పవర్ షేర్లు 120% పెరగడం ఆయనకు కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఐసీఐసీఐ, యాక్సిస్, DBS బ్యాంకులకు ఆయన చెల్లించాల్సిన బాకీలు సెటిల్ చేసేశారట. ఇప్పుడు జేసీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి కట్టాల్సిన రూ.2100 కోట్ల రుణాన్ని కూడా తీర్చేందుకు సిద్ధమయ్యారట.

News March 20, 2024

గ్రీన్ జెర్సీని రివీల్ చేసిన ఆర్సీబీ ప్లేయర్లు

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించి జెర్సీని ఆ టీమ్ రివీల్ చేసింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్‌ గ్రీన్ జెర్సీలో హాజరయ్యారు.

News March 20, 2024

ప్రతి మహిళకు ₹1000: DMK

image

తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్‌ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను ₹75, ₹65, ₹500గా ఖరారు చేస్తామని పేర్కొంది. స్టూడెంట్స్‌కు ఫ్రీ సిమ్ కార్డు, నెలకు 1GB డేటా, స్వయం సహాయక మహిళా గ్రూపులకు ₹10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

News March 20, 2024

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. ‘చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రలా నిలబడ్డాయి. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారు. బాబుది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అనే నైజం. ఈ మూడు పార్టీల పొత్తు ముందే ఊహించాం’ అని దుయ్యబట్టారు.