India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాహుల్ గాంధీ భవిష్యత్తు అంధకారమని, ఆయన అనుచరుల పరిస్థితి కూడా అదేనని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎద్దేవా చేశారు. 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. ‘ఇటీవల ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఉన్న మంచి లీడర్లంతా మావైపు వస్తారు. 2026 నాటికి ఈ ఓల్డ్ పార్టీ కనుమరుగవుతుంది’ అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ నెల 28న కొలువుదీరనుంది. ఈ కార్యక్రమం కోసం ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చేరుకున్నారు. అక్కడి మ్యూజియంలో ఇప్పటి వరకు అమితాబ్, షారుఖ్, ఐశ్వర్యారాయ్ విగ్రహాలు ఉండగా, ఇప్పుడు తొలి సౌత్ ఇండియా హీరోగా బన్నీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన MLC కవితను జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని ఈడీ కోర్టును కోరింది. 15 రోజులు కస్టడీకి పంపాలని అడిగింది. ఈ క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చాడు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు’ అని కవిత వ్యాఖ్యానించారు.

బెంగళూరులో బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. దర్శన్ బెట్టింగ్‌లో రూ.1.5కోట్లు పోగొట్టుకోగా.. బాకీ తీర్చాలని అప్పుల వాళ్లు ఒత్తిడి చేయసాగారు. దీంతో అతని భార్య రంజిత ఆత్మహత్యకు పాల్పడింది. అప్పు తీర్చకుంటే పరువు తీస్తామని వేధించినట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. కాగా నిందితులు బలవంతంగా తన అల్లుడి చేత అప్పు చేయించారని మృతురాలి తండ్రి ఆరోపించారు.

బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర <<12924073>>పోస్ట్<<>>పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇందుకు కారణమయిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వేరెవరో ఆ పోస్ట్ పెట్టారని.. దాన్ని తాను తొలగించినట్లు సుప్రియా తెలిపారు.

AP: కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’ అని ఫైర్ అయ్యారు.

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచు ఆయనకు 150వది. దీంతో భారత్ తరఫున 150 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచులు ఏకైక ఆటగాడిగా ఆయన నిలవనున్నారు. అలాగే ఈ మైలురాయిని చేరుకున్న 40వ ప్లేయర్‌గా నిలవనున్నారు. ఛెత్రి తన కెరీర్‌లో ఇప్పటివరకు 93 గోల్స్ చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

AP: అన్ని సర్వేలు చూశాకే తనకు BJP అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిందని సీఎం రమేశ్ తెలిపారు. ‘మా పార్టీలో పాత, కొత్త నేతల వివాదం లేదు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. నేను అనకాపల్లికి వస్తున్నాననే వైసీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ పొత్తును చూసి ఆ పార్టీ భయపడుతోంది. GVL నరసింహారావు విశాఖ టికెట్ ఆశించడంలో తప్పులేదు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ కోసం పనిచేస్తానన్నారు’ అని పేర్కొన్నారు.

AP: వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు, నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతోన్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.