news

News March 27, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

image

వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ఇమేజ్ టూల్ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. అలాగే ‘ఆస్క్ మెటా’ అనే మరో ఫీచర్‌నూ వాట్సాప్ తీసుకురానుంది. యాప్‌లో సెర్చ్ బార్ ద్వారా మెటా ఏఐని ప్రశ్నలు అడిగి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

News March 27, 2024

నన్ను వెంటనే విడుదల చేయాలి: కేజ్రీవాల్

image

లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయడం లోపభూయిష్టమైన చర్య అని ఢిల్లీ CM కేజ్రీవాల్ అన్నారు. తనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టును కోరారు. తాను తప్పు చేశానని ఆరోపిస్తున్న ఈడీ.. ఆ తప్పును నిరూపించడంలో ఫెయిల్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఓ సీఎంను అరెస్ట్ చేసిన విషయాన్ని గమనించాలని కోర్టుకు విన్నవించారు. ఇది తనపై సాధిస్తున్న రాజకీయ పగ అని ఆయన అన్నారు.

News March 27, 2024

ధోనీ కోసం దానిని వదులుకున్నా: రిజ్వీ

image

చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసిన వీడియోలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నం.7 జెర్సీని ధరించేందుకే ఇష్టపడతాను. అయితే, సీఎస్‌కేలో అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ధోనీ భయ్యాది. అందుకే దానికి బదులు నం.1 జెర్సీని ఎంచుకున్నా’ అని రిజ్వీ చెప్పుకొచ్చారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వీ 14 రన్స్ చేశారు.

News March 27, 2024

PMపై విమర్శలు.. మరో మంత్రిపై కేసు

image

ప్రధానిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మరో మంత్రిపై కేసు నమోదైంది. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివరాజ్ తంగడగి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు FIR నమోదు చేశారు. ఇదే కారణంతో ఇటీవల తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది.

News March 27, 2024

బెంగళూరు వాసులకు చిరంజీవి సలహా

image

నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరువాసులకు మెగాస్టార్ చిరంజీవి ఓ సలహా ఇచ్చారు. నీటి సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఆయన పోస్ట్ చేశారు. కాగా చిరుకి బెంగళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర్లోని దేవనహళ్లిలో ఫామ్ హౌస్ ఉంది. దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఈ ఫామ్ హౌస్‌లో మెగా కుటుంబానికి చెందిన వేడుకలు జరుగుతుంటాయి.

News March 27, 2024

లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లండన్‌లో ఓ లగ్జరీ హౌస్ కొన్నట్లు తెలుస్తోంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటినే ఆయన భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో ఆ ఇంటికి ప్రభాస్ నెలకు రూ.కోటి అద్దె చెల్లించేవారని టాక్. షూటింగ్స్, వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఆయన ఆ ఇంట్లో ఉండేవారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు రాజా సాబ్ సినిమా షూట్ కూడా చేయనున్నారు.

News March 27, 2024

ప్రియుడి❤️ కోసం రూ.25వేల కోట్లు వదిలేసింది

image

ఓ యువతి తన ప్రియుడి కోసం రూ.వేల కోట్ల సంపదను తృణప్రాయంగా వదిలేశారు. మలేషియాకు చెందిన బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె ఏంజెలిన్ ఫ్రాన్సిస్ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో చదివారు. ఆ సమయంలో జెడిడియాను ప్రేమించారు. కానీ వారి పెళ్లికి ఏంజెలిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రూ.వేల కోట్ల ఆస్తి కావాలో.. బాయ్‌ఫ్రెండ్ కావాలో తేల్చుకోమన్నారు. కానీ తన వాటా రూ.25 వేల కోట్లను ఆమె వదిలేసుకుని ప్రియుడిని పెళ్లాడారు.

News March 27, 2024

HYDలోనూ అదే సీన్ రిపీట్?

image

HYDలో నేడు SRHతో ముంబై మ్యాచ్ ఆడనుంది. అయితే పాండ్య టార్గెట్‌గా అరవాలని రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ముంబై కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి పాండ్యపై రోహిత్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన GTvsMI మ్యాచ్‌లో హార్దిక్ చీటర్ అంటూ అరిచారు. HYDలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. పాండ్య వీటిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి?

News March 27, 2024

కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది: ఆప్

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ‘మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒక సమయంలో ఆయన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 46 ఎంజీకి పడిపోయాయి. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు’ అని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది.

News March 27, 2024

గుండెపోటుతో టెన్త్ అమ్మాయి మృతి

image

AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన టెన్త్ విద్యార్థిని చిన్నారి(15) గుండెపోటుతో మృతి చెందింది. ఆమె స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. ఇవాళ పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. విద్యార్థిని కొన్నాళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు.