news

News April 1, 2024

ఎండలు భగభగ.. వడగాల్పుల సెగ

image

ఏపీలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయి. కడప, నంద్యాల, కర్నూలు, ATP జిల్లాల్లో 40-43 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 40-44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, SKLM, కాకినాడ, తూ.గో జిల్లాల్లోనూ 40- 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News April 1, 2024

టెట్ ఫీజులు తగ్గించండి: హరీశ్ రావు

image

TG: టెట్ ఫీజులను తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘టెట్ ఫీజులను భారీగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీలు ఇవ్వలేదు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం సరికాదు. మా ప్రభుత్వంలో టెట్ రెండు పేపర్లు రాసినా ఫీజు రూ.400 మాత్రమే ఉండేది’ అని గుర్తుచేశారు.

News April 1, 2024

జైలు నుంచి పాలించనున్న తొలి సీఎం!

image

లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న CM కేజ్రీవాల్‌‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతానికి 15రోజులు తిహార్ జైలు‌లో ఉండనున్నారు. జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఇలా జైలు నుంచి పాలించిన తొలి సీఎంగా నిలువనున్నారు. అయితే.. జైలు నుంచి ప్రభుత్వ పరమైన ఆర్డర్లు పాస్ చేయకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది.

News April 1, 2024

తిహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్‌‌

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌‌కు కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించనున్నారు.

News April 1, 2024

మయాంక్ అగర్వాల్‌పై SRH ఫ్యాన్స్ ఆగ్రహం

image

గుజరాత్ టైటాన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో SRH ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పవర్ ప్లేలో 17 బంతుల్లో 16 రన్స్ చేయడమే ఈ ఓటమికి ప్రధాన కారణమంటూ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముంబైతో హై స్కోరింగ్ మ్యాచ్‌లోనూ 13 బంతుల్లో 11 రన్స్ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. మయాంక్‌ను తప్పించి వేరొకరికి అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 1, 2024

‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

image

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదివరకే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుండగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ దీనికి వేదిక కానున్నట్లు సమాచారం.

News April 1, 2024

నియంత పాలనకు ఇదే నిదర్శనం: సీతక్క

image

TG: దేశంలో నియంత పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి సీతక్క ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. నిన్న అద్వానీకి భారత రత్న ఇచ్చే సమయంలో ప్రధాని మోదీ ఆయన పక్కనే కూర్చొని ఉండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిల్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆదివాసీ మహిళను అవమానించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

BREAKING: వాలంటీర్లకు మరో షాక్

image

AP: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది. ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీకి పిలవకూడదని స్పష్టం చేసింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాగా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది.

News April 1, 2024

‘కచ్చతీవు’పై స్పందించిన జైశంకర్

image

‘కచ్చతీవు’పై విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఇది ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని తెలిపారు. ‘ఈ దీవి గురించి కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు దాని గురించి 21 సార్లు తమిళనాడుకు సమాధానం ఇచ్చాను’ అని పేర్కొన్నారు. 1947 నాటికి భారత్‌ అధీనంలో ఉన్న దీవిని 5 దశాబ్దాల క్రితం కాంగ్రెస్ శ్రీలంకకు కట్టబెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 1, 2024

కచ్చతీవు వివాదం ఏంటి?(1/2)

image

భారత్ – శ్రీలంకను వేరుచేసే పాక్ జల సంధిలో రామేశ్వరం దీవికి సమీపంలో ఈ కచ్చతీవు ఉంది. 1.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ <<12964536>>దీవి<<>>లో ఎవరూ నివసించరు. ఇక్కడ సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగే వేడుకల్లో తమిళులు పాల్గొంటారు. స్వాతంత్ర్యం రాకముందు ఈ దీవి రామ్‌నాడ్ పాలకుల ఆధీనంలో ఉండేది. అనంతరం భారత్‌లో చేరింది. మత్స్యసంపద ఎక్కువగా ఉండటంతో భారత మత్స్యకారులు చేపల వేట సాగిస్తారు.