news

News April 2, 2024

ALERT: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

image

AIను వినియోగించి వాయిస్ మార్చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై TSRTC ఎండీ సజ్జనార్ అవగాహన కల్పిస్తున్నారు. బెంగళూరులో ఫోన్ చేసి బంధువుల వాయిస్‌ని ఏఐతో ఇమిటేట్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాల వలలో చిక్కుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 2, 2024

రామ్ చరణ్ సినిమాలో అమితాబ్ బచ్చన్?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మూవీలో చరణ్‌కు అమితాబ్ తాతయ్యగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కథంతా తాతా-మనవడు రిలేషన్ షిప్ మధ్య నడుస్తుందని టాక్. బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.

News April 2, 2024

పెన్షన్ల నిలుపుదలకు బాబే కారణం: మంత్రి మేరుగు

image

AP: పెన్షన్ల నిలుపుదలకు TDP చీఫ్ చంద్రబాబే కారణమని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ‘వాలంటీర్ల సేవల గురించి ప్రజలకు తెలుసు. చంద్రబాబు పేదలకు సాయం అందకుండా చేశారు. పింఛన్లు అందకపోవడంతో అవ్వాతాతలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 2, 2024

కావ్యా మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

image

ఐపీఎల్ చూసే వారికి కావ్యా మారన్ పరిచయమే. SRH ఓనర్‌గా ఆటగాళ్ల వేలం, మ్యాచ్‌ల సందర్భంగా ఆమె హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఏకైక కూతురు ఈమె. యూకేలో ఎంబీఏ పూర్తిచేశారు. దాదాపు రూ.33వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్య వారసురాలు. కొన్ని నివేదికల ప్రకారం ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు. ప్రస్తుతం SRH, ఈస్ట్రన్ కేప్ జట్లకు సీఈవోగా ఉన్నారు.

News April 2, 2024

తాత కొన్న షేర్లకు 75వేల శాతం రిటర్న్స్.. డాక్టర్ ఖుష్!

image

చండీగఢ్‌కు చెందిన డా.తన్మయ్ మోతీవాలా అనే పీడియాట్రిక్ సర్జన్‌కు ఫైనాన్స్ డాక్యుమెంట్లు సర్దుతుండగా 1994 నాటి SBI షేర్లు బయటపడ్డాయి. నాడు రూ.500 విలువ చేసే షేర్లను అతని తాత కొనుగోలు చేయగా, కొంతకాలానికి దాని సంగతే కుటుంబం మర్చిపోయింది. ఈ 30ఏళ్లలో ఆ షేర్ల విలువ 75వేల శాతం/ 750 రెట్లు పెరిగి రూ.3.75లక్షలకు చేరింది. ఈక్విటీల పవర్ ఇదేనంటూ ఈ విషయాన్ని తన్మయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

News April 2, 2024

సీఎం జగన్‌పై నాగబాబు విమర్శ.. గ్రంథి కౌంటర్

image

AP: సీఎం జగన్ హయాంలో అభివృద్ధి శూన్యమని జనసేన నేత నాగబాబు Xలో విమర్శించారు. దీనికి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందిస్తూ.. ‘సామాన్యులను చట్టసభలకు పంపే వ్యక్తి మా జగనన్న. పొత్తు లేనిదే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి నీ తమ్ముడు పవన్‌ది. నువ్వు అనకాపల్లి నుంచి పారిపోయావు. నీకు ఏం తెలుసని అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావ్?’ అని కౌంటర్ ఇచ్చారు.

News April 2, 2024

రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల రీ షెడ్యూల్

image

రెండు IPL మ్యాచ్‌లను BCCI రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 17న కోల్‌కతాలో జరగాల్సిన KKR, RR మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా నిర్వహించనుంది. ఈ నెల 16న ఇది జరగనుంది. ఈ మ్యాచ్ ఒక రోజు ముందుకు జరగడంతో ఈ నెల 16న GT, DC మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రీషెడ్యూల్ అయింది. దీనిని ఈ నెల 17న నిర్వహించనున్నారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని బెంగాల్ పోలీసులు తెలపడంతో BCCI మ్యాచ్ తేదీలు మార్చింది.

News April 2, 2024

మేడిగడ్డ కాళేశ్వరానికి వెన్నెముక: సీఎం రేవంత్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక వంటిది. వెన్నెముక విరిగితే మనిషి పని చేయలేడు. మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే. అక్కడి నుంచి నీళ్లు కిందికి వదిలింది కేసీఆర్ ప్రభుత్వమే. మిగతా పిల్లర్లకు ప్రమాదమని, నీళ్లు వదలాలని కేంద్ర బృందం చెప్పింది. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది’ అని చెప్పారు.

News April 2, 2024

BREAKNG: ఏపీలో ఉన్నతాధికారుల బదిలీ.. ఈసీ కీలక నిర్ణయం

image

AP: రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం(పరమేశ్వర్), పల్నాడు(రవిశంకర్ రెడ్డి), చిత్తూరు(జాషువా), అనంతపురం(అన్బురాజన్), నెల్లూరు(తిరుమలేశ్వర్) ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుని బదిలీ చేసింది. అలాగే ముగ్గురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఎస్పీలపైనా చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 2, 2024

ఎన్‌కౌంటర్‌: 9 మంది మావోయిస్టులు మృతి

image

ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 9కి చేరింది. గంగాలూరు పీఎస్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మరణించారు. తుపాకులతో పాటు భారీ ఎత్తున ఆటోమెటిక్ వెపన్స్ సీజ్ చేశారు.