News April 2, 2024
కావ్యా మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఐపీఎల్ చూసే వారికి కావ్యా మారన్ పరిచయమే. SRH ఓనర్‌గా ఆటగాళ్ల వేలం, మ్యాచ్‌ల సందర్భంగా ఆమె హావభావాలు సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఏకైక కూతురు ఈమె. యూకేలో ఎంబీఏ పూర్తిచేశారు. దాదాపు రూ.33వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్య వారసురాలు. కొన్ని నివేదికల ప్రకారం ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు. ప్రస్తుతం SRH, ఈస్ట్రన్ కేప్ జట్లకు సీఈవోగా ఉన్నారు.
Similar News
News April 23, 2025
విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.
News April 23, 2025
నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ

పహల్గామ్ ఉగ్రదాడిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖండించారు. తన హృదయం ముక్కలైందనే భావన వ్యక్తపరుస్తూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని ఆయన తన ఇన్‌స్టాలో క్యాప్షన్‌గా పెట్టారు. అలాగే ఈ దాడిని పలువురు సెలబ్రిటీలు కూడా ఖండించారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అలియా భట్, కరీనా కపూర్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
News April 23, 2025
IND, PAK మధ్య ఇక క్రికెట్ వద్దు: మాజీ క్రికెటర్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో PAKపై IND మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైరయ్యారు. అమాయకులను చంపడమే ఆ దేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. IND, PAK మధ్య ఇక ఎప్పటికీ క్రికెట్ మ్యాచులు నిర్వహించవద్దని BCCIని కోరారు. కొన్ని నెలల క్రితం తాను పహల్గామ్ వెళ్లానని, అప్పుడు అక్కడ శాంతి నెలకొన్నట్లు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. CT కోసం పాక్‌కు IND జట్టును BCCI పంపకపోవడాన్ని సమర్థించారు.