India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన వివాహిత అదృశ్యమైనట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. 32 ఏళ్ల కవిత భర్త చంద్రకాంత్‌కు మధ్య గొడవలు జరిగాయి. దీంతో శనివారం కవిత ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో టూ టౌన్‌లో ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ విష్ణు ప్రకాశ్ మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
ఇటీవల భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో పులి కనిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె శనివారం రాత్రి తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో పులి రోడ్డు దాడుతూ కనిపించినట్లు రైతులు స్వామి, అశోక్ తెలిపారు. వాహనాల లైట్ల వెలుతురుకి అది వెళ్లిపోయిందన్నారు.
పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మసాగర్‌కు చెందిన రైతు సాబ్లె గురుసింగ్ (60) పాము కాటుకు గురై మృతి చెందాడు. శనివారం చేనులో పని చేస్తుండగా పాము కాటు వేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఓసీ సంఘాల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు జనగం సంతోష్ తెలిపారు. సంఘ కార్యకలాపాలకు న్యాయం చేయకపోవటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా లేఖను జాతీయ కార్యవర్గానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సూచించారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. నాలుగు సంక్షేమ పథకాల్లో భాగంగా మండలం నుంచి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.
వ్యక్తి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ఆఫీస్ (40) తరచుగా భార్యతో గొడవలు పడేవాడు. శుక్రవారం వారి మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీతో మనస్తాపం చెందిన ఆఫీస్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు.
నార్నూర్ మండలంలో గత ఏడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన జాదవ్ విశ్వరక్షక్ ఈ నెల 17న శుక్రవారం ఉట్నూరులో పురుగు మందు తాగి మరణించారు. 23న గురువారం భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ బన్నీ అనే విద్యార్థి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖోఖో పోటీలు ఆడుతూ గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మాన్కపూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్రజావాణి కార్యక్రమం ఇక నుంచి ప్రతి రోజూ మండలంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ నెల 27 నుంచి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ, ఉపాధి హామీ, పెన్షన్, రేషన్ కార్డులు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై దరఖాస్తులు ఆయా మండలాల్లో కార్యాలయ అర్జీలను సమర్పించాలన్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్‌లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.