India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జొన్నల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రతి జొన్న రైతుకు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అమ్ముతున్న వివరాలను పొందుపరచాలని మార్కెటింగ్ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు.
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ADB జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. బేల మండలం పాటన్ గ్రామానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో బైక్‌పై మహారాష్ట్రకు మంగళవారం వెళ్తుండగా గడ్‌చందూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
3 ఏళ్ల చిన్నారి కడుపులోని బ్యాటరీని బయటకు తీసి కాపాడారు వైద్యులు. ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని తీసి అందరి మన్ననలు పొందారు. శ్రీరాంపూర్‌కు చెందిన రాజ్ కుమార్-మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య. 2 నెలల కిందట బటన్ బ్యాటరీ మింగాడు. కడుపులో మంట, నొప్పితో పలు ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు. డా.సతీశ్‌చందర్ ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని గుర్తించి బయటికి తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.
సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసమో.. హైప్ కోసం కత్తులు పట్టుకొని వీడియోలు పెడుతున్నారా.. జాగ్రత్త. ఇలాంటి వాటిపై ADB పోలీసులు దృష్టి సారించారు. ఎంతటి వారైనా తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. బైక్‌పై నోట్లో కత్తి పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేసిన బంగారిగూడకు చెందిన సలీంపై ఇప్పటికే కేసుపెట్టారు. ఇలాగే వ్యవహరించిన పలువురిపై చర్యలు తీసుకున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఉపేక్షించేది లేదంటున్నారు.
పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.
జైనథ్‌లోని సావపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి పేక ముక్కలు, రూ.16,830 సీజ్ చేశామన్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ సూచించారు.
మావలలోని వాఘాపూర్ గ్రామ శివారులో ఆదివారం బహిరంగంగా పేకాట ఆడుతున్న 12 మందిని సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదుతో పాటు 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని మావల పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.