Adilabad

News August 2, 2024

ASF: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

image

తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం పోస్టర్‌ను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా శిశు వైద్యశాఖ అధికారులతో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News August 2, 2024

దహెగాం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

image

దహెగాం మండల కేంద్రానికి చెందిన బండ మల్లేశ్ (33), ఎల్లూర్ గ్రామానికి చెందిన మంజుల అలియాస్ సుజాత(30)కు 13ఏళ్లక్రితం పెళ్లయింది. ఆరేళ్ల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు(23)తో అక్రమసంబంధం పెట్టుకుంది. సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేశ్ గొంతునులిమి హత్య చేసినట్లు సీఐ అల్లం రాంబాబు, ఎస్సై కందూరి రాజు శుక్రవారం పేర్కొన్నారు. సుజాత, రాజును రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 2, 2024

ఆదిలాబాద్: సొంత జిల్లాకు వచ్చిన ఏకైక MEO

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక MEOగా పేరొందిన D.సోమయ్య బదిలీల పుణ్యమా అని సొంత జిల్లాకువచ్చారు. జిల్లాకు చెందిన సోమయ్య ఏకంగా 19 ఏళ్ల పాటు ప్రస్తుత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల ఎంఈవోగా పనిచేసి సొంత జిల్లాకు బదిలీపై రావడం పట్ల అధికారులు, మిత్రులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం DEO ప్రణీతను మర్యాదపూర్వకంగా కలిశారు.

News August 2, 2024

నర్సాపూర్: తల్లికి అంత్యక్రియలు చేసిన కూతురు

image

తల్లికి కుతురు అంత్యక్రియలు చేసిన ఘటన నర్సపూర్ మండలం రాంపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తోకల దత్తు-వనజ దంపతులకు స్రవంతి, స్వప్న కూతుర్లు ఉన్నారు. కుటుంబాన్ని పోషించలేక 15 ఏళ్ల క్రితమే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోగా తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఈక్రమంలో గురువారం అనారోగ్యంతో మృతి చెందగా గ్రామస్థులు నగదు జమచేసి కూతురితో అంత్యక్రియలు జరిపించారు.

News August 2, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News August 2, 2024

భీమిని: బహిర్భూమికి వెళ్లి రైతు మృతి

image

బహిర్భూమికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీమినిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొవ్వూరు సత్తయ్య అనే రైతు శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం ఆయనకు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాగులో నీటి మునిగి మరణించారని తెలిపారు. ఘటనకు సంబంధిత మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 2, 2024

ఆదిలాబాద్ : పంచాయతీ పోరుకు సన్నద్ధం..!

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తమవుతోంది. రిజర్వేషన్ల విషయం ఇంకా తేల్చనప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. జిల్లా నుంచి అయిదుగురిని మాస్టర్ ట్రైనర్లుగా అధికార యంత్రాంగం ఎంపిక చేసింది. వీరు హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. అనంతరం జిల్లాలో మిగతా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు.

News August 2, 2024

ఆదిలాబాద్: ఇదే చివరి అవకాశం..!

image

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్‌కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఇచ్చోడ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.

News August 2, 2024

బాసర గోదావరిలో యువతి మృతదేహం

image

బాసర గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభించినట్లు గురువారం ఎస్ఐ గణేష్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి వద్ద ఉన్న బ్యాగులో మూడువేల రూపాయల నగదు, బంగారు గొలుసు, మెట్రో ఐడీ కార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News August 2, 2024

ఆదిలాబాద్: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటి జిల్లాస్థాయి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముందుకు రావాలన్నారు.