India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాకేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల లైసెన్స్ సర్వేయర్స్ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. శిక్షణ పూర్తి అనంతరం గత నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా వాటి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. 155 మందికి కేవలం నలుగురే పాస్ అయ్యారు. 100కి 60 శాతానికి పాస్ పర్సంటేజ్ కావడంతో దానిని 50 శాతానికి తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ADB టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు అందించిన సేవలు అభినందనీయమని డీఎస్పీ జీవన్‌రెడ్డి కొనియాడారు. బుధవారం సాయంత్రం ఘన్పూర్ సర్కిల్‌కు బదిలీపై వెళ్తున్న కరుణాకర్ రావుకు డీఎస్పీతో పాటు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై విష్ణుప్రకాష్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కరుణాకర్‌రావు తీసుకున్న చర్యలు అమోఘమని ప్రశంసించారు.

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తర్వాత టూర్ పెడతానని తెలిపారన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు గిరిజన ప్రాంత సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.

నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం సాత్నాల మండలకేంద్రంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గేట్ ఎత్తే వేసే ముందు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందజేయాలని సూచించారు.

సాత్నాల ప్రాజెక్టు కుడి కాల్వ కింద జైనథ్ మండలంలో ఉన్న లక్ష్మీపూర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7,600 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటం, సాత్నాల కుడి కాలువ నుంచి లక్ష్మీపూర్ ప్రాజెక్టులోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో అలుగు పారే అవకాశం ఉంది.

మిషన్ శక్తి – DHEW బృందం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో బుధవారం హర్ ఘర్ తిరంగా ప్రచారం కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని చేపట్టినట్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

భారీ వర్షాల వల్ల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉట్నూరు, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, సోనాల మండలాలలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించినట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు సంబంధిత మండలాల ఎంఈఓలకు, పాఠశాల ప్రిన్సిపల్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

పక్షులంటే ఆ పసివాడికి ప్రాణం. చిన్నప్పుడే పావురాలతో అతడికి స్నేహం ఏర్పడింది. వాటితో ఒక్కరోజు గడపకపోతే అతడిలో ఏదో వెలితి కనిపిస్తుంది. ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆదిల్ 40కి పైగా పావురాలను పెంచుకుంటున్నాడు. రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పావురాలతో గడుపుతాడు. వాటికి ఆహారాన్ని అందిస్తుంటాడు. పక్షులపై విద్యార్థి చూపిస్తున్న ప్రేమకు చుట్టుపక్కల వాళ్లు ఫిదా అవుతున్నారు.

భారీ వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 18004251939కు కాల్ చేయాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

జిల్లాకేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రాథోడ్ విక్కీ(32) మంగళవారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లి ఉరేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.