India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్‌లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
గంజాయిని కలిసికట్టుగా అరికడదాం అని, గంజాయి పండించడం, వాడడం చట్టరీత్యా నేరమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ప్రతి కళాశాలలో ఆంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గంజాయి నిర్మూలనకు వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లలోపు వారికి నిషేధిత డ్రగ్స్ మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అందించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో పరీక్షా కేంద్రాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ -2025 పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు.
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 10,106 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు.
నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్ష జరుగుతున్న సమయంలో బాపురావు అనే విద్యార్థికి అకస్మాత్తుగా ఆస్తమా, బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 లో రిమ్స్ తరలించగా.. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.
కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో బుధవారం జరిగిన <<15659751>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> జిల్లాకు చెందిన 16 మందికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామానికి చెందిన వీరు మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరు ప్రయాణిస్తు వాహనం బోల్తాపడింది.
Sorry, no posts matched your criteria.