Adilabad

News February 28, 2026

ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

image

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

image

ఆదిలాబాద్‌‌ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

image

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

image

ఆదిలాబాద్‌లోని బాలక్ మందిర్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం ప్రారంభించారు. గణితం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి, ఆసక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని, సరైన పద్ధతిలో నేర్పితే అది అత్యంత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన శాస్త్రమని పేర్కొన్నారు.

News February 27, 2026

ఆదిలాబాద్: విద్యార్థినితో కలెక్టర్ చిట్ చాట్

image

విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బాలక్ మందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బల్లపై కలెక్టర్ కూర్చున్నారు. విద్యార్థినితో మాట్లాడి కాసేపు చిట్ చాట్ చేశారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్ ఉన్నారు.

News February 27, 2026

ఆదిలాబాద్: వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలి: అదనపు కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ వివాదాల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన వారు వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News February 27, 2026

ADB: సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం రెండో విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ధ్రువపత్రాలను, లైసెన్స్‌లను అందజేశారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

News February 27, 2026

ఆదిలాబాద్: నేర నియంత్రణకు సమన్వయ చర్యలు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రామస్థాయి సమాచార వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు-చిన్నారుల రక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ అక్క-ఖాకీ కిడ్స్ ద్వారా అవగాహన పెంచాలని ఆదేశించారు.

News February 27, 2026

ఉట్నూర్: గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు: హుస్సేన్ నాయక్

image

కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని కుమ్మరి గుంట, కామయి పేట్ పసుపుల గ్రామాల్లో పీవో యువరాజ్ మర్మాట్‌తో కలిసి పర్యటించారు. గిరిజనుల స్థితిగతులను పరిశీలించారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం ద్వారా అర్హులైన గిరిజనులకు పథకం ఫలాలు అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు.