India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.

విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు ఎక్కువ పరిష్కరించేలా దృష్టి పెట్టాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్ రావు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు హల్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత లోక్ అదాలత్ కంటే ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.

సీఎం కప్ 2025-26 జూడోలో ఆదిలాబాద్ క్రీడాకారుల విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన పతకాలు సాధించిన విజేతలను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూడో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.

మాజీ ఎంపీ, బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.