Adilabad

News February 23, 2026

ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

News February 23, 2026

ఆదిలాబాద్: 67 మంది దరఖాస్తు.. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

image

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘రేవంత్ అన్న కా సహారా – మిస్కినో కే లియే’ పథకం కింద సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ (DLSSC) సమక్షంలో మోపెడ్ వాహనాల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకానికి మొత్తం 67 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.

News February 23, 2026

రేపు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన

image

ఈనెల 24న మంగళవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

News February 23, 2026

38 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 38 ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు.

News February 23, 2026

ఆదిలాబాద్ గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులు: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

News February 23, 2026

ఆదిలాబాద్: జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా పాలిటెక్నిక్

image

పాలిటెక్నిక్‌లను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా ఉన్నతీకరించామని, ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రచారం ప్రారంభించిందని ADB సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు POLYCETపై అవగాహన కల్పించామన్నారు. ఈ సంవత్సరంకొత్త కోర్సులు అందుబాటులో వచ్చాయన్నారు.

News February 23, 2026

ఆదిలాబాద్‌: ఈ మండలాల్లో 2 రోజులు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

image

సీతగొండి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనాధ్, మావల, తంసి, భీమ్పూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లోని 406 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీనితో ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News February 23, 2026

నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

image

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

News February 23, 2026

తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

image

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

News February 22, 2026

కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

image

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.