India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
ADBలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. RR నగర్‌కు చెందిన వనజ శనివారం ఆటోలో ప్రయాణించి అశోక్ రోడ్డులో దిగిపోయింది. ఆటోలోనే తన బ్యాగును మరచిపోయింది. ఖానాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జమీల్ ఖాన్ ఆటోలో బ్యాగు ఉన్న విషయం గమనించాడు. ఆ బ్యాగులో రూ.12 వేలు, 3 ఫోన్లు ఉండటాన్ని చూసి నేరుగా వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ అప్పగించగా.. సీఐ బాధితురాలి జాడ తెలుసుకొని ఆటో డ్రైవర్‌తో ఆమెకు బ్యాగ్ అందజేశారు.
నార్నూర్ బ్లాక్‌కు డెల్టా ర్యాంకింగ్ నిధుల క్రింద విద్య, ఆంగన్వాడీ సమాజ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యా, మహిళా శిశుసంక్షేమశాఖ, ట్రైబల్, నీతి అయోగ్ కో ఆర్డినేటర్‌లతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి పనుల వివరాల ప్రపోజల్ 3 రోజుల్లో సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్ తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు, రచయిత, చిత్ర కారుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత సామల రాజవర్థన్ ‘తెలుగులో భాషా దోషాలు’ అనే అంశంను విద్యార్థులకు వివరించారు.
ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు అధికారిగా (DIEO) GJC ప్రిన్సిపల్ జాధవ్ గణేశ్ కుమార్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు DIEOగా ఉన్న రవీందర్ కుమార్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో గణేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం DIEOగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పి స్వాగతించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆదిలాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇవాళ, రేపు 36 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఈనెల 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా..18,880 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఫస్ట్ ఇయర్లో 9,106 మంది, సెకండ్ ఇయర్ లో 9,774 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 2 సెట్టింగ్ స్క్వాడ్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు హైపవర్ కమిటీని నియమించారు.
ఎలాంటి పొరపాట్లు, కాపీయింగ్‌కు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు
Sorry, no posts matched your criteria.