India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.

ఈ నెల 18న ఆదిలాబాద్‌లోని రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అధికార జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 18న బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండవ శనివారాన్ని పని దినంగా పరిగణించాలని, ఈ విషయాన్ని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిను తక్షణమే ఉపసంహరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినందున మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఇకపై వర్తించవని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.

ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా 44వ వార్డు కౌన్సిలర్ ఎండీ రోహిత్ ఎన్నికయ్యారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికలో రోహిత్‌కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఛైర్‌పర్సన్ ఎన్నిక తరహాలోనే వైస్ ఛైర్మన్ ఎంపికలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర సభ్యులు ఆయనకు ఓటు వేశారు. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో రోహిత్ ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఛైర్‌పర్సన్‌గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ఎన్నికలో ఆమెకు 27 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర సభ్యులు అనూషకు మద్దతు తెలిపారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,050గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.70 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.