Adilabad

News July 18, 2024

ADB: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి.. ఇద్దరు జైలుకు

image

విధులు నిర్వరిస్తున్న పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు 2టౌన్ CI కరుణాకర్‌రావ్ తెలిపారు. RIMSలో కొలిపూర్‌కు చెందిన సాయికుమార్, నవీన్ ఇద్దరు మంగళవారం మద్యం మత్తులో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. గొడవ ఆపేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI వెల్లడించారు.

News July 18, 2024

ASF: నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News July 17, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్యాంశాలు

image

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో తొలిఏకాదశి వేడుకలు
★ ముధోల్ : కుళ్ళిన అంగన్వాడీ కోడిగుడ్లు
★ ఆదిలాబాద్ : పోలీసులపై డాడి.. ఇద్దరు జైలుకు
★ భైంసా : నీటిలో మునిగి ఎద్దు మృతి
★ ఆదిలాబాద్ : మహారాష్ట్ర మద్యం బాటిళ్ల పట్టివేత
★ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు పూర్తి
★ ఆదిలాబాద్ : యువకుడి అదృశ్యం
★ మందమర్రి : గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్
★ త్వరలో జిల్లాకు డిప్యూటీ సీఎం రాక

News July 17, 2024

ఆదిలాబాద్: మూడు రోజులు భారీ వర్షాలు..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా మంగళవారం ఆసిఫాబాద్ దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

News July 17, 2024

ముథోల్: Way2 News ఎఫెక్ట్.. బస్‌స్టాండ్‌లో విద్యుత్ దీపాలు

image

విద్యుత్ దీపాలు లేక ముధోల్ బస్‌స్టాండ్‌లో వారం రోజులుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనిపై Way2 Newsలో ”అంధకారంలో ముథోల్ ఆర్టీసీ బస్టాండ్” అనే శీర్షికతో కథనం ప్రచురితం అయింది. కథనానికి స్పందించిన అధికారులు బుధవారం బస్టాండ్‌లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 17, 2024

ఆదిలాబాద్: డిగ్రీలో చేరే వారికి గమనిక

image

DOST ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు తమ గ్రూపు, మీడియంను మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లు ADB జిల్లా దోస్త్ కో- ఆర్డినేటర్ నర్సింగ్‌రావు తెలిపారు. దోస్త్ లాగిన్ లోకి వెళ్లి ఐడీ పిన్ నంబరును ఎంటర్ చేసి తమ గ్రూపు లేదా మీడియంను ఈ నెల 18లోగా మార్చుకోవచ్చన్నారు. గ్రూపు లేదా మీడియం మార్చుకున్న విద్యార్థులకు కొత్త గ్రూపు లేదా మీడియంను 19న కేటాయించనున్నట్లు వెల్లడించారు.

News July 17, 2024

అవిశ్వాసం నేప‌థ్యంలో కాంగ్రెస్ విప్ జారీ

image

ఆదిలాబాద్ మున్సిప‌ల్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం నేప‌థ్యంలో మూడు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేతలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. బ‌ల్దియా కార్యాల‌యంలో జ‌ర‌గ‌నున్న అవిశ్వాస స‌మావేశానికి త‌ప్ప‌కుండా హాజ‌రై మ‌ద్ద‌తు తెల‌పాల‌ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌ కౌన్సిల్ స‌భ్యుల‌కు విప్‌లు జారీ చేశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడిపెల్లి న‌గేష్‌ నోటీసులు గోడలపై అతికించారు.

News July 17, 2024

ఆదిలాబాద్: డీఎస్సీ పరీక్ష రాయనున్న 29,543 మంది

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29,543 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. నిర్మల్ జిల్లాలో 342 పోస్టులకు 6,035, ADBలో 324 పోస్టులకు 9,569, MNCLలో 288 పోస్టులకు 8,262, ASFలో 341 పోస్టులకు 5,677 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

News July 17, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు GOOD NEWS

image

రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈనెల 18న రైతుల ఖాతాల్లో తొలి విడుతగా రూ.లక్ష జమ చేస్తామని CM ప్రకటించారు. 2018-12-12 నుంచి 2023-12-9 వరకు పంట రుణాలు రూ.2లక్షల్లోపు మాఫీ కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ ఉన్న 4.50 లక్షల మందికి రూ.3,509 కోట్లు కావాలని అధికారుల అంచనా. ADB 1.17- రూ.1030.61కోట్లు, మంచిర్యాల 0.94- రూ.804.22, నిర్మల్ 1.20- రూ.952.39కోట్లు, ASF 1.19- 722.18 కోట్లు అవసరం కానున్నాయి.

News July 16, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ లోని నేటి ముఖ్యాంశాలు

image

★ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వర్షం
★ కాగజ్ నగర్: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
★ ముధోల్: విద్యుత్ షాక్ తో గేదెమృతి
★ నిర్మల్: 14 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
★ భైంసా: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
★ కడెం: క్షణికావేశంలో ఒకరు ఆత్మహత్య
★ చిట్యాల: అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టిన లారీ
★ ADB: జైలునుంచి విడుదలైన బీజేపీ నాయకులు
★ బెజ్జుర్: భారీ కొండ చిలువ ప్రత్యక్షం
★ భైంసా: దొంగ అరెస్ట్