India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సైబర్ నేరాల పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బుపై అత్యాశతో, ఉద్యోగంపై ఆసక్తితో లేదా తక్కువ సమయంలో లోను వస్తుందని సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోతున్నారని వివరించారు. ఆర్థిక నేరం, సోషల్ మీడియా నేరం, యూపీఐ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ వంటి మోసాలకు గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. ఈ వారం జిల్లాలో 11 సైబర్ ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే ప్రధాని లక్ష్యం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. అన్నీ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు, వ్యవసాయం, డెయిరీ, ఫిషరిష్ రంగాలను ప్రోత్సహించడానికి రూ.42 వేల కోట్లతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదిలాబాద్ మహువా లడ్డూల గురించి ప్రస్తావించడం ద్వారా రోజువారీ అమ్మకాలు 7 నుంచి 60 కిలోలకు పెరిగాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నెలకు 2,000 కిలోల లడ్డూలు అమ్ముడవుతున్నాయని, అవి ‘ఆదివాసీ ఆహారం’ పథకంలో భాగంగా 60 హాస్టళ్లకు చేరుతున్నాయన్నారు. ఈ లడ్డూలు ఆదివాసీ మహిళలకు నిలకడైన ఆదాయం, గౌరవాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనను ప్రతివారం పరిశీలించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గన్ లైసెన్సులపై శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే వారి వివరాలు తీసుకొని బైండోవర్ చేయాలన్నారు. సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని సూచించారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు.

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రజలు వినతులను స్వీకరించేందుకు ప్రజావాణిని తిరిగి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆర్టీఐ చట్టాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు RTI వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ ప్రైవేట్ ITI, ATCలలో ప్రవేశాల కోసం 5వ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్ చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ అవకాశం ఉందన్నారు. ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా, సీట్లు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

ADB: తొలుత మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ 80 , జెడ్పీటీసీ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC/ MPTC స్థానాలు.. బజార్హత్నూర్ (08) , భీంపూర్ (07), బోథ్ (10), ఇచ్చోడ (13), గుడిహత్నూర్ (09), నేరడిగొండ (08), సిరికొండ (05), సోనాల (05),
తలమడుగు (10), తాంసి (05) ఉన్నాయి.

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 10న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో IT, DPO పోస్టు కొరకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 75%మార్కులతో ఇంటర్ పూర్తిచేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
SHARE IT.

నేరాలు జరగకుండా పటిష్టమైన గస్తీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మావల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది విధులను, ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కర్ర స్వామి సహా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.