Adilabad

News March 9, 2025

ఉట్నూర్: ఈ నెల 16న ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష

image

ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ నెల 7 నుంచి ఆన్లైన్‌లో హాల్ టికెట్‌లను దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 8, 2025

ADB: LRS సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

అనుమతి లేని లే అవుట్ క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు హెల్ప్ డెస్క్‌ను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సందేహాలు ఉన్నవారు సెల్ ఫోన్ 8309959444 నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25శాతం రిబేట్ వర్తిస్తుందని పేర్కొన్నారు.

News March 8, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం ధరల్లో మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News March 8, 2025

ADB: నేడు మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు

image

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. కాగా జనవరి 31న నాగోబా జాతర సందర్భంగా పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించగా.. ఇవాళ రెండో శనివారం జిల్లాలోని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించారు.

News March 8, 2025

పురుగుల మందు తాగి యువకుడు మృతి

image

బోథ్ మండలం చింతగూడకి చెందిన గేడం వినోద్ కుమార్ (25) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 12న తల్లిదండ్రులు మందలించడంతో పురుగుల మందు తాగాడు. ADB రిమ్స్ లో చికిత్స పొంది మార్చి 4 న ఇంటికి తీసుకెళ్లారు. అనారోగ్యం తిరగబెట్టడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించాడని తెలిపారు

News March 8, 2025

ADB: 10వ తేదీ వరకే సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలు చేపట్టడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులకు ప్రకటనలు తెలిపారు. కావున ఆన్లైన్లో పత్తి పంట వివరాలు డేటా కలిగి ఉన్న రైతులు తమవద్ద మిగిలి ఉన్న నాణ్యమైన పత్తిని 10వ తేదీ లోపే తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. ఈ విషయంపై సీసీఐ, మార్కెట్ శాఖ అధికారులకు రైతులు సహకరించాలని కోరారు.

News March 8, 2025

బజార్హత్నూర్‌లో నీటి సమస్యపై స్పందించిన మాజీ మంత్రి

image

వేసవికాలం ప్రారంభం మొదలు తాగునీటి కోసం గిరిజనులకు తిప్పలు తప్పడంలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బజార్హత్నూర్ మండలం చింతకర్రలో మిషన్ భగీరథ నీళ్లు అందక ఆ గ్రామస్తులు వ్యవసాయ బావి నుంచి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కనీసం నీటి సమస్యను పరిష్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని, బజార్హత్నూర్‌లో నీటి సమస్యపై మాజీ మంత్రి ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు

News March 7, 2025

ADB: నూతన జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్

image

ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ ఐపీఎస్ నియామకమయ్యారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్న గౌస్ ఆలం ఐపీఎస్ కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వెళ్ళనున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల ఎస్పీగా వ్యవహరిస్తున్న అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

News March 7, 2025

ఆన్ లైన్‌లో పరీక్ష ఫలితాలు: ADB డీఈఓ

image

చేతివృత్తుల కోర్సుకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హేయిర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేశామన్నారు. http//bse.telangana.gov.in వెబ్ సైట్‌లో రోల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకొని ఫలితాలు చూడవచ్చని సూచించారు.

News March 7, 2025

ADB: రూ.20లక్షల అప్పు.. అందుకే సూసైడ్!

image

నేరడిగొండలో <<15670214>>దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్‌కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్‌లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.