India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప హక్కని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతోపాటు, ఎన్నికల సమయంలో తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రత్యేకంగా ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 మండలాల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పలువురికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నార్నూర్, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నుర్, భీంపూర్ మండలాల్లోని 400 మంది యువకులకు మొదటి విడతలో భాగంగా లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని పీవో యువరాజ్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని, తండాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 16,405 ఇండ్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.156 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా నాగోబా దర్బార్‌లో తెలిపారు. పీవీటీజీ కుటుంబాలకు ప్రత్యేకంగా 639 ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెందూర్ శాంతాబాయికి ఆహ్వానం లభించిందన్నారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిరోజు ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ తెలిపారు. గురువారం కూడా ప్రాక్టికల్స్ యథావిధిగా కొనసాగుతాయని నాగోబా సెలవు ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ప్రాక్టికల్‌కు హాజరు కావాలని సూచించారు. కాగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల)లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను DIEO సందర్శించి పరిశీలించారు.

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జనవరి 23వ తేదీన జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) నిర్వహిస్తున్నట్లు DIEO జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశం విద్యార్థుల విద్యా ప్రగతికి కీలకమని, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మ.3 గంటల నుంచి సా.6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు వంద మందికి గాను 93 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 99 మంది హాజరై.. ఒక్కరు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపల్ పున్నారవ్ తెలిపారు.

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించే చారిత్రాత్మక నాగోబా జాతర ప్రజా దర్బార్ను పురస్కరించుకుని జనవరి 22న జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సెలవు ఉంటుందన్నారు. ఈ సెలవుకు బదులుగా మార్చి రెండవ శనివారం విద్యాసంస్థలు పని చేయాల్సి ఉంటుందని సూచించారు.
Sorry, no posts matched your criteria.