Adilabad

News January 30, 2026

కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్ఓ

image

ప్రజలందరి భాగస్వామ్యంతో కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. గతలమడుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుష్ఠు వ్యాధిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు

News January 29, 2026

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉట్నూర్ యువకుడికి చోటు

image

ఉట్నూర్‌కు చెందిన యువకుడు అల్లకొండ అరుణ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్లాక్ బెల్ట్ 3rd డన్‌లో 30 నిమిషాల్లో 1255 కిక్స్ కొట్టి ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమంలో 973 మంది విద్యార్థులు కలిపి 8 లక్షల కిక్స్ కొట్టారు.

News January 27, 2026

ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా పాటించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ దృష్ట్యా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపులో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News January 27, 2026

రెచ్చగొట్టే ప్రచారంపై కఠిన చర్యలు: డీఎస్పీ

image

ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో గెలుపోటములపై రెచ్చగొట్టే పోస్టులు, వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్య నేరమని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, తప్పుడు సర్వేలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News January 27, 2026

లక్ష్యాలను సాధించని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు: DMHO

image

సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఏ ఒక్క రోగిని వదలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి రోగుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం DMHO కార్యాలయ సమావేశ మందిరంలో ఏంఎల్.హెచ్.పీ, ఏఎన్ఎంలతో అసాంక్రమిత వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

News January 27, 2026

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ

image

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్, సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

News January 27, 2026

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ బందోబస్తు: ADB SP

image

రంజాన్ మాసంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ‘అరైవ్ అలైవ్’ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని, రాత్రి 11:30 గంటల తర్వాత బయట ఉండొద్దన్నారు.

News January 27, 2026

జాతీయ వెబినార్‌‌లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్

image

జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమం కింద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్వహించిన వాటర్ సిరీస్ వెబినార్‌లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న జల సంరక్షణ ఉత్తమ విధానాలను ప్రస్తావించారు. వర్షపు నీటి సంగ్రహణ, సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ, జల్ జీవన్ మిషన్, పీఎంఖెఎస్‌వై వంటి పథకాల సమన్వయంతో భూగర్భ జల మట్టం పెంపుదలపై చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

News January 27, 2026

ఇంద్రవెల్లి: ముగిసిన నాగోబా జాతర

image

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నేటితో ముగిసింది. 9రోజులుగా కొనసాగిన నాగోబా జాతర ఉట్నూర్ మండలం శ్యాంపూర్ బుడుం దేవతకు పవిత్ర గంగాజలంతో ఆదివారం మహా పూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం “ఝరి” తాలిని భద్రపరిచేందుకు మేస్రం వంశీయులు కాలినడకతో కేస్లాపూర్‌లోని శాంతి నిలయానికి చేరుకొని మెస్రం వంశీయులు కలశం (జారీ)దేవతకు ప్రత్యేక పూజలు చేసి నాగోబా జాతరకు ముగింపు పలికారు.

News January 26, 2026

అక్రెడిటేషన్ జర్నలిస్టులే PRESS అని రాసుకోవాలి: ADB DPRO

image

అక్రెడిటేషన్ జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై PRESS అని స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. PRESS లేని వారు, ఇతర వర్గాలు ఇష్టారీతిన వాహనాలపై PRESS అని రాయవద్దని సూచించారు. ఇది మోటార్ వాహన చట్టం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.