Adilabad

News February 1, 2026

‘ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోండి’

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల కోసం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకం దరఖాస్తులు ప్రారంభమైనట్లు జిల్లా సంక్షేమ అధికారి సునీత కుమారి తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి అర్హులైన అభ్యర్థులు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

News January 31, 2026

ADB కలెక్టర్‌ను కలిసిన జైలు పర్యవేక్షణాధికారి

image

ఆదిలాబాద్ జిల్లా జైలు పర్యవేక్షణాధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పందిరి గోపిరెడ్డి శనివారం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జైలు శాఖ ఆధ్వర్యంలో మరో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, జైలు నర్సరీ మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

News January 31, 2026

ADB కలెక్టర్ రాజర్షిషాకు ఉపాధ్యాయుల వినతి

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పదవీ విరమణకు సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని పిఆర్టీయూ తెలంగాణ సంఘం జిల్లా నాయకులు కోరారు. శనివారం జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వయసు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు.

News January 31, 2026

ఇంటర్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

image

రానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో అకడమిక్ రివ్యూ, పరీక్షల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని పేర్కొన్నారు.

News January 31, 2026

సోమవారం ప్రజావాణి రద్దు : ఆదిలాబాద్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసిన వెంటనే తిరిగి యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News January 31, 2026

పారదర్శకంగా నామినేషన్ల పరిశీలన: కలెక్టర్‌ రాజర్షిషా

image

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన సందర్శించి, పరిశీలన తీరును స్వయంగా పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్, కమిషనర్‌ రాజు, మాస్టర్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

News January 31, 2026

ఆదిలాబాద్: మున్సిపల్ ఛైర్మన్‌లుగా తండ్రీకొడుకులు

image

ఆదిలాబాద్ మున్సిపల్ అధ్యక్షులుగా పనిచేసి తండ్రీకొడుకులు చరిత్ర సృష్టించారు. 1962-65 మధ్య మసూద్ అహ్మద్ ఖుర్షీద్ మున్సిపల్ ప్రెసిడెంట్‌గా, 1972లో ఎమ్మెల్యేగా సేవలందించారు. సాత్నాల ప్రాజెక్ట్, సీసీఐ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన తనయుడు జావిద్ అహ్మద్ 1995లో మున్సిపల్ ఛైర్మన్‌గా విజయం సాధించి తండ్రి బాటలో నడిచారు. జిల్లా అభివృద్ధిలో వీరి సేవలు చిరస్మరణీయమని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

News January 31, 2026

ఇంద్రవెల్లి: దంపతుల గొడవ.. గొంతుకొసుకున్నాడు

image

ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ పుకెట్ నగర్‌కు చెందిన రామదాస్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో మనస్తాపం చెందిన ఆయన ఆవేశంలో గొంతు కోసుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం రామదాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.