India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంతు నాయక్ సందర్శించారు. DPRO విష్ణువర్ధన్‌ను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలకు లోబడి వార్తలు ప్రచురించాలని సూచించారు. మీడియా పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం రవి, మెప్మా పీడీ రాజు, సిబ్బంది ఉన్నారు.

సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 34 మంది ఫిర్యాదుదారుల సమస్యలను నేరుగా విని, వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై త్వరిత స్పందనతో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారాన్ని 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లు కలిపి మొత్తం జనరల్ విభాగంలో 1,888 మంది విద్యార్థులకు గాను 1,745 మంది హాజరై 143 మంది గైర్హాజరయ్యారని DIEO జాధవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 1,189మంది విద్యార్థులకు గాను 1,100మంది విద్యార్థులు హాజరై 89 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్, ఒకేషనల్ కలిపి 3,077మంది విద్యార్థులకు గాను 2,845మంది హాజరై 232 మంది గైర్హాజరయ్యరన్నారు.

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ నెలకొంది. ఇటీవల BRS నుంచి అధికార కాంగ్రెస్‌లో చేరిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు నిరాశే మిగిలినట్లు సమాచారం. వీరిలో కొంతమంది అభ్యర్థులకు B ఫామ్ వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. టికెట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటున్నామని వాట్సాప్ స్టేటస్‌లో నేతలు ఆవేదన వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘మిషన్ 10th క్లాస్’ పేరుతో బహుమతులు ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధిస్తే రూ.5లక్షలు, రెండో ర్యాంకుకు రూ.3లక్షలు అందజేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి జిల్లా టాపర్‌కు రూ.2లక్షలు, నియోజకవర్గ టాపర్‌కు రూ. లక్ష చొప్పున బహుమతులు అందనున్నాయి. ఎమ్మెల్యేకు సంస్థ ప్రతినిధులు వివరించగా హర్షం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అధికారులు అత్యంత అప్రమత్తంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా ఆదేశించారు. ఆదివారం రాత్రి బట్టిసావర్గం చెక్‌పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా చెక్‌పోస్టుల పనితీరు కీలకమన్నారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

ఇంటర్ ప్రాక్టికల్‌కు జనరల్ విద్యార్థులు 6148, బైపీసీ 347, ఎంపీసీ 2673, ఓకేషనల్ 1893 మంది కలిపి మొత్తం 8041 మంది హాజరుకానున్నట్లు DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. జనరల్ విద్యార్థులకు 29, ఒకేషనల్ విద్యార్థులకు 11 మొత్తం 40 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే జనరల్, ఓకేషనల్ కలిపి 4 కేంద్రాలు, ఓన్లీ జనరల్ 25, ఓకేషనల్ 7 మొత్తం 36 సెంటర్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

శాంతిభద్రతల పరిరక్షణ ప్రశాంతంగా సాగేందుకు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, డీజేలు, మైకులు, అధిక శబ్ద పరికరాలు నిషేధమని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో జనవరి నెల పొడవునా నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా 85 మంది బాల కార్మికులను రక్షించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీరిలో 79 మంది బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. రక్షించిన వారిలో 72 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 13 మందిని వసతి గృహాలకు చేర్చామన్నారు. జిల్లావ్యాప్తంగా 35 కేసులు నమోదు చేశామని, బాలలను పనిలో పెట్టుకోకుండా బడులకు పంపాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరీక్షలు పారదర్శకగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.