Adilabad

News February 4, 2026

ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

News February 3, 2026

ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

News February 3, 2026

ఆదిలాబాద్: ‘ఉచిత శిక్షణకు గడువు పొడిగింపు’

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో 5నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ డా.రమేశ్ మంగళవారం తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News February 3, 2026

ADB జిల్లాలో సమర్ధవంతంగా ఎరువుల బుకింగ్ యాప్: DAO

image

ఆదిలాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల బుకింగ్ యాప్ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని DAO శ్రీధర్ స్వామి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 26370 మంది రైతులు ఈ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేయగా, వారు 90530 బస్తాల యూరియాను బుక్ చేసి, సంబంధిత డీలర్ దుకాణాల కొనుగోలు చేశారన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు ముందుగానే ఎరువుల లభ్యతను తెలుసుకోవచ్చన్నారు.

News February 3, 2026

51 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం: ఆదిలాబాద్ ఎస్పీ

image

మహిళలు, యువతులు, చిన్నారుల భద్రతకు ఆదిలాబాద్ షీ టీం నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నెలరోజుల్లో 56 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 45 గ్రామాలు సందర్శించి,187 హాట్ స్పాట్స్‌లలో తనిఖీ చేసి 51 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పారు. పోలీస్ అక్క ద్వారా బాల్యవివాహాలు నిలిపివేసినట్లు తెలిపారు. మహిళలు సహాయం కోసం 8712659953 లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.

News February 2, 2026

ఆదిలాబాద్: ఘరానా మోసగాడు ARREST

image

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో Cheazi Logistics Pvt. Ltd పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తానని నమ్మించి పలువురిని మోసం చేసిన చిత్తూరి శేఖర్‌ను అరెస్ట్ చేశామని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. 2 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది బాధితుల నుంచి రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News February 2, 2026

ఆదిలాబాద్: ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం జిల్లాలో 16పరీక్ష కేంద్రాలను చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగిన పరీక్షల ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. పలు కేంద్రాలను DIEO, ఇద్దరు జిల్లా పరీక్షల కమిటీ మెంబర్లను, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.

News February 2, 2026

ఆదిలాబాద్: ‘ఛైర్మన్ ఎన్నికకు నోటీసులు జారీ చేసే ఆప్షన్ తీసుకోవాలి’

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో నిర్వహించే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియోల మున్సిపాలిటీ ఎంపిక కోసం నోటీసులు జారీ చేసే ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.