Adilabad

News February 7, 2026

ఆదిలాబాద్: సమయం లేదు మిత్రమా..!

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా విశ్వ ప్రయత్నాలతో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా ప్రచారానికి సమయం నేటితో కలిపి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి.

News February 7, 2026

ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

image

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.

News February 7, 2026

ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

image

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.

News February 6, 2026

ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

image

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు బీ.సాయన్న సూచించారు. POLYCET ప్రవేశ పరీక్ష గురించి ఇచ్చోడ, బజరత్నుర్, జాతర్ల, పిప్రి, సోనాల పార్ది బీ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కల్పించారు. పదో తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ గురించి వివరించారు. పాలిసెట్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం గురించి వివరించారు.

News February 6, 2026

ఆదిలాబాద్: ప్రకృతి వ్యవసాయంతో లాభాలు: డీఏఓ

image

ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని డీఏఓ శ్రీధర్ స్వామి సూచించారు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానంలో జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 40 మందికి కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక లాభాలు ఉన్నాయన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మల్లేష్ పాల్గొన్నారు.

News February 6, 2026

ఆదిలాబాద్: దేశ రక్షణకు భారత సైన్యంలో చేరాలి: కలెక్టర్

image

దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే యువతకు భారత సైన్యం గొప్ప వేదికని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత సైన్యంలో చేరడం అంటే కేవలం ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కాదని, అది దేశం పట్ల మమకారాన్ని చాటుకునే ఒక గౌరవప్రదమైన జీవనశైలి అని అన్నారు.

News February 6, 2026

ADB: బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వెరిఫికేషన్ ప్రక్రియ పరిశీలన

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జడ్పీ కార్యాలయంలోని ముద్రణాలయం, స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. బ్యాలెట్ పేపర్ల నాణ్యత, అక్షర దోషాలు లేకుండా ముద్రణ జరుగుతుందా, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు.

News February 6, 2026

ఆదిలాబాద్: భారత సైన్యంలో చేరడం గౌరవప్రదం

image

భారత సైన్యంలో చేరడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఒక గౌరవప్రదమైన జీవనశైలి అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు మార్గదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్(ARO) ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రేరణాత్మక ఉపన్యాసాన్ని ఇచ్చారు.

News February 6, 2026

ఆదిలాబాద్: ఎన్నికల్లో POలు, APOల పాత్ర కీలకం

image

మున్సిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO) కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా హాజరై మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో POలు, APOల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశానికి ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహించాలన్నారు.

News February 6, 2026

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

image

మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు కావడమే లక్ష్యంగా కలెక్టర్ రాజర్షి షా స్వీప్ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి వాహనాన్ని పంపించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.