India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకమని, కౌంటింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సిబ్బందికి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఛాంబర్‌లో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన మూడవ విడత రాండమైజేషన్ ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారి ఫణిందర్, ఎన్నికల సిబ్బంది, తదితరులు ఉన్నారు

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

మున్సిపల్ పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల్లోని 216 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై పోలింగ్ ఇన్‌ఛార్జ్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు మొత్తం 2,154 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. 2026–28 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు. మీడియా యజమాన్యాలు తమ ప్రతినిధుల పేర్లను డీపీఆర్ఓకు పంపించాలన్నారు. https://ipr.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.